Annapurna Studios: అన్నపూర్ణ స్టూడియోస్ విషయంలో నాగ్ చేసిన పనికి దండం పెట్టాల్సిందే!

Annapurna Studios: తెలుగు సినీ ప్రేక్షకులకు అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు. హీరోగా మారిన తర్వాత రెండు చేతుల సంపాదిస్తూ ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా ఖర్చు చేసేవారు. ఇక నందమూరి తారక రామారావు సూచనల మేరకు నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోస్ ని నిర్మించారు. కానీ అప్ప‌టికి ఇంకా ఇండ‌స్ట్రీ అంతా హైద‌రాబాద్‌కు రాలేదు. దీంతో తొలినాళ్ల‌లో స్టూడియోలో ఆయ‌న సొంత సినిమాలు తీసుకునేవారు.

తన సొంత సినిమాలు లేకపోతే ఆ స్టూడియోకు తాళ‌మే. దీంతో ఏదోఒక సినిమా ఎప్పుడూ చేయాల‌ని నిర్ణ‌యించుకుని అక్కినేని అదే ప‌నిచేశారు. కానీ, ఎన్నాళ్ల‌ని సొంత సినిమాలు చేస్తాం అనుకుని దాదాపు కొన్నాళ్ల పాటు గ్యాప్ ఇచ్చారు. త‌ర్వాత హైద‌రాబాద్కు ఇండ‌స్ట్రీ వ‌చ్చినా.అప్ప‌టికి హీరో కృష్ణ ప‌ద్మాల‌యా సినిమా స్టూడియోను నిర్మించుకున్నారు. ఇక‌, రామా నాయుడు కూడా మ‌రో స్టూడియో నిర్మాణం చేసుకున్నారు. దీంతో అంతో ఇంతో పుంజుకుంటున్న స‌మ‌యంలో ఈ రెండు కూడా అధునాతన సౌక‌ర్యాల‌తో పోటీ ఇచ్చాయి.

 

అదేవిధంగా అన్నగారు కూడా రామ‌కృష్ణా సినీ స్టూడియోస్ పేరుతో ఆయ‌న కూడా సొంత‌గా స్టూడియో నిర్మించుకున్నారు. ఇక‌, విసిగిపోయిన అక్కినేని దీని బాధ్య‌త‌ల‌ను ఆయ‌న కుమారుడు, హీరో నాగార్జున‌కు ఇచ్చారు..దీంతో అప్ప‌టికే ఇబ్బందుల్లోనూ లాస్‌లోనూ ఉన్న స్టూడియోను గాడిలో పెట్టేందుకు నాగార్జున చాలానే కృషి చేశారు. ఇక్క‌డే సినిమాల్లో న‌టించేవారికి శిక్ష‌ణ ఇప్పించారు. అదేస‌మ‌యంలో అద్దెకు ఇవ్వ‌డంలో ఉన్న నిబంధ‌న‌ల‌ను కూడా స‌డ‌లించారు. అలా హీరో నాగార్జున స్టూడియో బాధ్యతలను చూసుకోవడంతో పాటు హీరోగా కూడా రాయించేవారు. త‌ర్వాత టీవీల చానెళ్లు పెరిగాక‌ వాటికి లీజు ప‌ద్ద‌తిలో ఇచ్చారు. దీంతో అన్న‌పూర్ణ స్టూడియో లాభాల బాట‌ప‌ట్టింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -