Inaya Sultana: హీరోయిన్ అవ్వాలి అంటే ఆ పని చేయనవసం లేదు అంటున్న ఇనయా సుల్తానా

Inaya Sultana: ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన సెలబ్రిటీ ఎవరైనా ఉన్నారా అంటే ఇనయా అని ఇది సులువుగా చెప్పొచ్చు. బిగ్‌బాస్ షో పుణ్యమా అని ఈ అమ్మడు మంచి కాన్ ఫాలోయింగ్ సంపాదించింది. బిగ్‌ బాస్ తెలుగు 6 షో లో ఇనయా మామూలు హడావిడి చేయలేదు. 13 వారాలపాటు హౌస్ లో ఫైర్ బ్రాండ్ లాగా రెచ్చిపోయిన ఇనయా అనూహ్యంగా గేమ్ నుంచి ఎలిమినేట్ చేయబడింది. అయితే ఇది అన్యాయంగా జరిగింది అని సోషల్ మీడియాలో ఆమె అభిమానులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఇనయా సుల్తానా మీడియాతో టాలీవుడ్ లో తాను ఎదుర్కొన్న అనుభవాల గురించి మాట్లాడారు.

బిగ్ బాస్ షో కంటే ముందు ఆర్జీవి పార్టీ తో ఇనయా సుల్తానా బాగా ఫేమస్ అయింది. రాంగోపాల్ వర్మతో కలిసి ఓ పార్టీలో ఆమె వేసిన డాన్స్ సోషల్ మీడియాలో మారుమోగింది. అందులో ఇనయాను ముద్దు పెడుతూ వర్మ చేసిన ఓవర్ యాక్షన్ మరియు అసభ్యకరమైన డాన్స్ సోషల్ మీడియా లో వైరల్ అయింది. ఆ ఒక్క సంఘటనతో ఇనయా ఓవర్‌నైట్ సెలబ్రిటీ అయింది. ఒకరకంగా బిగ్ బాస్ షోలో ఆమెకు అవకాశం దక్కడానికి ఆ పాపులారిటీ కారణం అని చెప్పవచ్చు.

బిగ్ బాస్ నుంచి వివాదాస్పదంగా ఇనయా సుల్తానాను అవుట్ చేయడంపై ఆమె అభిమానులు భారీగా నిరసన వ్యక్తం చేశారు. వినయ అన్సార్ ఎలిమినేషన్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ న్యూస్ ను బాగా వైరల్ చేశారు. తన అనుభవాల గురించి మీడియాతో ముచ్చటిస్తున్న సమయంలో ప్రముఖ హీరో సినిమా ఆఫర్ కోసం తన సెలెక్షన్ కి పిలిచారని. కానీ సెలక్షన్ చేసే క్రమంలో వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ఆమె ఆందోళనకు గురి అయిందని తెలిపింది.

 

కమిట్మెంట్ ఇస్తావా ? ఆఫర్ ఇస్తాము? అని వంకర టింకర సంభాషణతో ఆ నిర్మాతకు సంబంధించిన కొందరు వ్యక్తులు తనతో మాట్లాడారని చెప్పింది. అటువంటి ఆఫర్స్ నాకు అవసరం లేదు అని సమాధానం ఇచ్చి ఆ సినిమాని రిజెక్ట్ చేశాను అని చెప్పుకొచ్చింది. మరొకసారి నేరుగా పడక గదిలోకి వస్తావా? అని ఆమెతో అవమానంగా మాట్లాడారని. మరో సినిమా ఆఫర్ కోసం వెళితే అక్కడ కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యిందని. ఈ కారణాలవల్ల తన కెరీర్ లో వచ్చిన రెండు మంచి అవకాశాలను చేజార్చుకోవాల్సి వచ్చింది అని ఆమె బాధపడింది.

అడ్డదారులు తొక్కి సంపాదించి సినిమా పరిశ్రమలో నిలబడాల్సిన అవసరం తనకు లేదని. ఇటువంటి వాటికి తను వ్యతిరేకమని. కేవలం ప్రతిభ మీదే అవకాశం తెచ్చుకొని వచ్చిన పాత్రలు పోషించడంలో సంతోషాన్ని వెతుక్కుంటానని ఈ సందర్భంగా ఇనయా సుల్తానా చెప్పారు.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: వైఎస్ షర్మిల షాకింగ్ ప్లాన్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

YS Sharmila: వైఎస్ఆర్ టీపీ అధినేత షర్మిల కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఉద్దేశపూర్వకంగానే కలిసిందా.. దీని వెనక...
- Advertisement -
- Advertisement -