IND-BAN: ఓటమితో సతమతమవుతున్న భారత్ జట్టు కు జరిమానా షాక్!

IND-BAN: మొదటి వన్డే సిరీస్ లో బంగ్లాదేశ్ చేతిలో భారత్ జట్టు భయంకరమైన ఓటమిని చవిచూసింది. భారత్ బ్యాట్స్ మాన్ పెలవమైన పర్ఫామెన్స్ వల్ల చాలా తక్కువ స్కోర్ కు భారత్ జట్టు ఆల్ అవుట్ అయిపోయింది. నిన్నటి మ్యాచ్ లో భారత జట్టు పెర్ఫార్మన్స్ పై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అసలే ఓటమితో సతమతం అవుతున్న భారత జట్టు పై ఐసీసీ భారీ జరిమానా ను విధించింది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు.. అసలే నిరాశతో ఉన్న భారత జట్టు ఈ వార్త విని తీవ్రత భ్రాంతికి గురి అయింది. వికెట్ తీయలేక ఆఖరి నిమిషంలో ఇండియన్ బౌలర్స్ చేతులు ఎత్తడం వల్ల మూడు వన్డే సిరీస్ లో బంగ్లాదేశ్ ఒక వికెట్ తేడాతో భారత్ పై గెలుపును సాధించింది. ఇప్పుడు 1-0 లీడ్ తో ఈ సీరియస్ లో భారత్ కంటే ముందంజలో ఉంది.

స్లో ఓవర్‌ రేట్ కారణం వల్ల ఈ మ్యాచ్‌కు రిఫరీ రంజన్‌ మదుగలె టీమిండియా ప్లేయర్స్‌ కు మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత విధించారు. టీమ్ ఇండియా నిర్ణీత ఓవర్ల కంటే నాలుగు ఓవర్లు తక్కువగా వేసినట్టు తెలుస్తుంది. ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌లోని ఆర్టికల్‌ 2.22 ప్రకారం ఒక్కోస్లో ఓవర్‌ రేట్‌ ఓవర్‌కు ఫీజు లో 20 శాతం వరకు తగ్గించాలి.

కాబట్టి నిర్ణీత ఓవర్ల కంటే ముందుగా ఎవరు తక్కువ వేయడంతో వారి ఫీజులో 80 శాతం కోతను విధించడం జరిగింది. టీం కెప్టెన్ రోహిత్ శర్మ స్లో ఓవర్ రేట్ తప్పును ఒప్పుకోవడం గమనార్హం.

మ్యాచ్ ప్రారంభంలో టీమిండియా బాటర్ల పేలవమైన పర్ఫామెన్స్ కారణంగా 186 పరుగులకే ఆల్ అవుట్ అయింది. కానీ బౌలర్స్ ఎంతో కష్టపడి బౌలింగ్ చేసి బంగ్లాదేశ్ ను నియంత్రించడంలో కొంతవరకు సఫలమయ్యారు. బంగ్లాదేశ్ 136 పరుగులకు 9 వికెట్లు కోల్పోవడంతో ఓటమి కచ్చితం అని అందరూ భావించారు.కానీ మెహదీ హసన్‌ అనూహ్యంగా 39 బాల్స్ కు 38 పరుగులు చేసి బంగ్లాదేశ్ టీమ్ ను ఒక వికెట్ తేడాతో గెలిపించాడు.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -