IND-BAN Match: వన్డే సిరీస్ ఫ్రీ గా చూడాలి అని అనుకుంటున్నారా?

IND-BAN Match: ఇండియాలో క్రికెట్ కి ఉండే క్రేజ్ ని మాటల్లో వర్ణించలేం. ఆటని ఆటలా కాకుండా మతం లా చూస్తారు అభిమానులు. ఇక ఆటగాళ్ళకు ఉండే అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. టికెట్ రేట్ ఎంత ఉన్నా సరే స్టేడియం కి వెళ్ళి మ్యాచ్ ఆస్వాదించడానికి ఇష్టపడతారు. ఇటీవల న్యూజిలాండ్ సిరీస్ ముగించింది భరత జట్టు. టీ20 సిరీస్ మనం గెలవగా వన్డే సిరీస్ న్యూజిలాండ్ గెలిచింది.

 

బంగ్లాదేశ్ తో సై!

భారత్ అభిమానులు బంగ్లాదేశ్ సిరీస్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. స్టార్ ఆటగాళ్లు అందరూ జట్టులోకి మళ్ళీ వచ్చారు. న్యూజిలాండ్ సిరీస్ మిస్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ జట్టులో చేరారు. టీమిండియా సాధన మొదలుపెట్టింది. ఆటగాళ్లు అందరూ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. వన్డే ప్రపంచ కప్ వచ్చే ఏడాది ఉంది కాబట్టి ప్రతి వన్డే సిరీస్ మనకి ముఖ్యమే.

ఎక్కువగా హాట్ స్టార్ మ్యాచ్ లను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఐతే ఈ మధ్య ఇతర మాధ్యమాలు కూడా గట్టి పోటీ ఇస్తున్నాయి. న్యూజిలాండ్ సిరీస్ ని ప్రైమ్ వీడియో ప్రసారం చేసింది. ఈ సిరీస్ ని చూడటానికి కొంత మంది ప్రైమ్ సబ్స్క్రిప్షన్ కూడా తీసుకున్నారు.

ఆదివారం ప్రారంభం కానున్న బంగ్లాదేశ్ సిరీస్ విషయానికి వస్తే సోనీ బ్రాడ్కాస్టింగ్ హక్కులను సొంతం చేసుకుంది.సోనీ టెన్1, 2,3, 4 చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి ఈ మ్యాచ్ లన్నీ. సోనీ లీవ్ యాప్ లో కూడా మనం మ్యాచ్‌లు చూడవచ్చు. జియో టీవీ యాప్ లో కూడా ఈ మ్యాచ్ లు వస్తాయి. ఈ సిరీస్ లో భాగంగా ఇండియా బంగ్లాదేశ్ వన్డే సిరీస్ అలాగే టెస్ట్ సిరీస్ ఆడనున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -