IND-BAN: ఇండియా, బంగ్లా తొలి వన్డేలో ఎన్ని రికార్డులు నమోదయ్యాయో తెలుసా?

IND-BAN: బంగ్లాదేశ్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో భారత్ జట్టు ఘోర పరాజయం పాలయ్యింది. ఈ మ్యాచ్లో భారత్కు చెందిన బ్యాటర్లు పేలవంగా పెర్ఫార్మ్ చేసినప్పటికి, బౌలర్లు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా చివరి క్షణం వరకు పోరాడారు. అయినప్పటికీ చివరి వికెట్ తీయడంలో విఫలమైన భారత్ చెట్టు ఓడిపోయింది.

ఇటు మ్యాచ్ ప్రారంభం నుంచి బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఎంతో పట్టుదలగా ఆడి మ్యాచ్ను గెలుచుకున్నారు. భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఈ వన్డే సిరీస్ లో మూడు రికార్డులు బద్దలయ్యాయి. మ్యాచ్ ఓడిపోవడమే కాకుండా కొన్ని చెత్త రికార్డులను భారత్ తన ఖాతాలో జమ చేసుకుంది.

తక్కువ స్కోర్

బంగ్లాదేశ్ తో ఎప్పుడు మ్యాచ్ ఆడిన మెరుగైన ప్రదర్శన ఇస్తూ భారత్ జట్టు మంచి స్కోర్ చేసేది. కానీ 2014లో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి కేవలం 105 పరుగులకే ఆల్ అవుట్ అయింది భారత జట్టు. మళ్లీ తిరిగి ఇప్పుడు మరోసారి అతి స్వల్పస్ కోర్కె బంగ్లాదేశ్ చేతుల్లో భారత జట్టు ఆల్ అవుట్ అయింది.

చెలరేగిన షకీబల్

తొలి వన్డే మ్యాచ్ లోనే భారత్ జట్టు నడ్డి విరిచాడు బంగ్లాదేశ్ బౌలర్. అద్భుతంగా చెలరేగిన షకీబల్ హసన్ ధాటికి భారత్ బౌలర్లు చేతులెత్తేశారు. ఈ మ్యాచ్లో అతను ఐదు వికెట్లు తన ఖాతాలో జమ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఒకే స్టేడియంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా షకీబల్ రికార్డు స్థాపించాడు.

ఒకే మైదానంలో ఎక్కువ వికెట్లు తీసిన ఘనత షార్జా స్టేడియంలో 122 వికెట్లు తీసిన వసీం అక్రమ్ కు దక్కింది. బంగ్లా స్టేడియంలో మ్యాచ్ మొదలవడానికి ముందే ఈ స్కోర్ చేరుకున్న షకీబల్ ఈ మ్యాచ్లో ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకొని అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు.

అత్యధిక ఓటమి జాబితా

వన్డే ఫార్మాట్లో చాలా బలిష్టంగా కనిపించే భారత్ జట్టు అత్యధిక ఓటములు చవిచూసింది. ఇప్పటివరకు 1018 వన్డేలు ఆడిన భారత్ 435 మ్యాచ్లు పైగా ఓడిపోయింది. 878 వన్డేలో ఆడిన శ్రీలంక కూడా ఇప్పటివరకు 435 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఈ విధంగా వన్డే మ్యాచ్ లలో అత్యధిక ఓటమి చవిచూసిన జట్టుగా శ్రీలంక జతన భారత్ నిలిచింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -