IND-BAN: టీమిండియా ఓటమికి కారణం ఆ స్టార్ బ్యాట్స్ మెనే కారణమా? ఫ్యాన్స్ ఆగ్రహం.

IND-BAN: ఇటీవల బంగ్లా పర్యటనలో భాగంగా బంగ్లాతో టీమిండియా ఆడిన మొదటి వన్డేలో భారత్ ఘోర పరాజయం మూటకట్టుకుంది. పసికూన బంగ్లా చేతిలో ఓటమి పాలు అవడం భారత క్రికెట్ అభిమానులు తట్టుకోలేక పోతున్నారు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇలా మొదటి వన్డే మ్యాచ్ లో డీలా పడడం అభిమానులను విస్మయానికి గురి చేసింది.

మిర్పూర్ వేదికగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో భారత క్రికెట్ జట్టు అన్ని విభాగాల్లోనూ విఫలమైంది. బ్యాటింగ్‌లో పేలవమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టు బౌలింగ్‌లో కొంతమేర ఫరవాలేదు అనిపించింది. అయితే ప్రత్యర్థి బంగ్లా స్కోరు 136 పరుగులకు 9 వికెట్లు కూల్చిన తరుణంలో.. విజయానికి కారణమయ్యే ఆ ఒక్క వికెట్ తీయడానికి తడబడడం విమర్శలకు తావిస్తోంది.

రిపీట్ అవుతున్న మిస్టేక్స్..
గత కొన్ని రోజులుగా టీమిండియాను పీడిస్తున్న సమస్య ఈ మ్యాచ్ లో మళ్ళీ రీపీట్ అయ్యింది. బౌలర్లు కొంతమేర రాణించిన ఫిల్డింగ్ వైఫల్యం మ్యాచ్ ఫలితాన్ని మార్చివేసింది. ఒకానొక దశలో దాదాపుగా ఇండియా గెలుపు ఖాయమైన సమయంలో.. కేవలం మిస్ ఫీల్డింగ్స్ చేయడం టీమ్ విజయాన్ని చేజార్చి వేసాయి.

రాహుల్ గనుక ఆ క్యాచ్ వదలక పోయి ఉంటే..
బంగ్లా తొమ్మిది వికెట్లు కోల్పోయి దాదాపు ఓటమి అంచున ఉన్నప్పుడు.. కెఎల్ రాహుల్ మంచి క్యాచ్ వదిలేసాడు. మెహిదీ హసన్ ఇచ్చిన ఆ క్యాచ్ ను గనుక రాహుల్ వదలకపోయి ఉంటే.. మ్యాచ్ ఇండియా గెలిచి ఉండేది. ఇక ఆ క్యాచ్ డ్రాప్ తర్వాత హసన్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేసి.. బంగ్లా కు విజయాన్ని అందించాడు. దీనితో ఇండియా ఓటమికి రాహులే కారణమంటూ అభిమానులు మంది పడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -