Indraganti Mohan Krishna: నిన్ను తొక్కేస్తారు నీకు సినిమాలు ఎందుకు అంటూ ఇంద్ర గంటి మోహన్ కృష్ణకు అవమానం?

Indraganti Mohan Krishna: ఇంద్రగంటి మోహనకృష్ణ సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు. ఈయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం గ్రహణం. ఈ చిత్రానికి నంది పురస్కారం లభించింది. ఇక మోహన కృష్ణ ఇటీవలే కాలంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఇక ఈయన దర్శకత్వంలో ఇటీవలే సుధీర్ బాబు హీరోగా, కృతి శెట్టి హీరోయిన్గా వచ్చిన చిత్రం ”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”.

ఈ సినిమా ఎందుకు తీయాలి అనిపించింది అనే ప్రశ్న డైరెక్టర్ మోహన కృష్ణకు ఎదురయింది. దీంతో తనకు సినిమా రంగం అంటే చాలా ఇష్టమని.. కానీ చాలామంది సినిమా రంగంలో సపోర్ట్ ఉండాలని.. ఫలానా కులం వాళ్లు డామినేట్ చేస్తారని.. తాను వెళ్లిన కూడా టాలెంట్ ఉంది కదా అని గుర్తించరు అనే మాటలు చాలామంది నోటా విన్నానని తెలిపాడు. కానీ ఆయన తనను తాను నమ్ముకుని 18 సంవత్సరాల లో 10 సినిమాలు చేశారని పేర్కొనడం జరిగింది.

తాను ఎటువంటి నిర్మాత సపోర్ట్, ఏ హీరో సపోర్ట్ లేకుండా, బ్యాకప్ లేకుండా కేవలం ప్రేక్షకుల సపోర్ట్ తోనే సినిమాలు చేశానని తెలిపాడు. తాను ప్రేక్షకులు ఏ విధంగా ఆలోచిస్తారు.. ప్రేక్షకులు ఎటువంటి సినిమాను అయితే యాక్సెప్ట్ చేస్తారు అనేది.. ఇవన్నీ తాను ముందుగానే చూసుకొని సినిమాలు చేస్తానని పేర్కొనడం జరిగింది.

తనను తాను నిరూపించుకుంటే నిర్మాతలు ఎదురొచ్చి, తనతో సినిమాలు చేస్తారు అనేది తన అభిప్రాయం అని తెలిపాడు. అందుకు తాను ఒక ట్రాజెడీ చేయాలనుకున్నాడట. తనకు తెలియని పాత్రను క్రియేట్ చేస్తే అప్పుడు ప్రేక్షకులు ఎలా చూస్తారు అనుకొని ఈ సినిమా చేసినట్లు తెలిపాడు. ఒక సెటిల్ అయినా డైరెక్టర్ కథలో మార్పు ఒక అమ్మాయి వల్ల వస్తే ఎలా ఉంటుందో చూపించాలి అనుకొని ఈ సినిమా చేసినట్లు పేర్కొనడం జరిగింది.

Related Articles

ట్రేండింగ్

AP Recruitments: ఎలాంటి రాతపరీక్ష లేకుండా రూ.50,000 వేతనంతో జాబ్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

AP Recruitments:  నిరుద్యోగులకు శుభవార్త, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ని తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జిల్లా...
- Advertisement -
- Advertisement -