Charith Manas: మహేష్ ఫ్యామిలీ నుంచి మరో హీరో రెడీ.. సినిమాల్లో ఈ హీరో సక్సెస్ సాధిస్తాడా?

Charith Manas: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక మహేష్ బాబు తర్వాత మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి పలువురు హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు. ఇక ఇండస్ట్రీలోకి రావడానికి మహేష్ బాబు కుమారుడు గౌతమ్ మాత్రమే మిగిలి ఉన్నారని త్వరలోనే ఈయన ఎంట్రీ కూడా ఉండబోతుంది అన్న వార్తలు వచ్చాయి.

నమ్రత మాత్రం తన చదువులన్నీ పూర్తి అయిన తర్వాతనే గౌతమ్ సినిమాల గురించి ఆలోచిస్తాడనీ చెప్పుకొచ్చారు. ఇకపోతే మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కంటే ముందుగానే మరొక హీరో ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలుస్తుంది. మరి ఆ వ్యక్తి ఎవరో కాదు సుధీర్ బాబు హీరోగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. సుధీర్ బాబు కుమారుడు మానస్ ప్రస్తుతం 15 సంవత్సరాల వయసు .

ఇప్పటికే సుధీర్ బాబు కుమారుడు తన సినిమాలలో బాల నటుడుగా నటించి మెప్పించారు. అయితే తాజాగా మామ మశ్చేంద్ర సినిమా ద్వారా సుధీర్ బాబు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కూడా మానస్ ఒక చిన్న పాత్రలో నటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సుదీర్ బాబు మాట్లాడుతూ మానస్ కి సినిమాలు అంటే చాలా పిచ్చి వాడే వీడియోలు తీసుకుంటూ ఎడిటింగ్ చేసుకుంటూ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంటారని తెలిపారు.

సినిమాలపై ఎంతో ఇష్టం ఉన్నటువంటి తాను అదే వైపు ప్రయాణించడం చాలా మంచి నిర్ణయం అంటూ ఈయన వెల్లడించారు. మరో మూడు నాలుగు సంవత్సరాలలో తన కొడుకు హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతారంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి మహేష్ బాబు కుటుంబం నుంచి హీరోగా రాబోతున్నటువంటి మానస్ ఇండస్ట్రీలో సక్సెస్ సాధిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -