Indraja: నాగార్జునతో చేయడం ఇష్టం లేదు.. కానీ బలవంతం చేశారు

Indraja:నాటి హీరోయిన్, నేటి బుల్లితెర జడ్జ్‌గా ఇంద్రజ ఫుల్ ఫాంలో ఉంది. ఒకప్పుడు సినిమాలతో ఆకట్టుకున్న ఇంద్రజ.. ఇప్పుడు బుల్లితెరపై అందరినీ అలరిస్తోంది. అయితే ఈమె కెరీర్ తెలుగులో ఎక్కువగా సాగలేదు. పెళ్లి తరువాత సినిమాకు దూరంగా ఉంటూ వచ్చింది. అయితే హీరోయిన్లలో కొంత మందికి మాత్రమే.. ఐటం సాంగులు చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకొందరు వాటికి ఆమడ దూరంలో ఉంటారు.

ఇప్పుడు అయితే హీరోయిన్లకు ఎక్కువ డబ్బులు ఇస్తే.. ఐటం సాంగులు చేస్తారు. కానీ ఒకప్పుడు మాత్రం వాటిని చేసేందుకు సంశయించేవారు. కానీ కొందరు మాత్రం తప్పని పరిస్థితుల్లో చేస్తుంటారు. పెద్ద వాళ్లు అడిగారని, పెద్ద బ్యానర్లు అడిగారని తప్పక చేయాల్సి వస్తుందని ఇంద్రజ చెప్పుకొచ్చింది. తాను చేసిన రెండు ఐటం సాంగ్‌ల గురించి ఇంద్రజ తెలిపింది.

ఆ రోజుల్లోనే ఇంద్రజ రెండు ఐటెం సాంగ్స్ చేసింది. నాగార్జున సరసన కన్నెపిట్టరో స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ చేసి అలరించింది. అలాగే ఓ తమిళ సినిమా లో కూడా ఐటెం సాంగ్ చేసి మెప్పించింది. తాజా ఇంటర్వ్యూలో వాటి గురించే అడగగా.. ఇంద్రజ మాట్లాడుతూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. “నిజానికి అలాంటి సాంగ్స్ చేయాలని ఏ హీరోయిన్ కి ఉండదు. పెద్ద వాళ్ల రిక్వెస్టుపైనే ఎక్కువగా చేస్తాం. పెద్ద బ్యానర్‌ అడిగినప్పుడు మనం నో చెప్పితే.. బాగుండదు. పెద్ద బ్యానర్ కదా అనే చాలా మంది ఒప్పుకోవాల్సి వస్తుంది. నేను ఇష్టం లేకుండానే ఆ పాటలు చేశాను.

అయినా, ఇప్పుడు వాటి గురించి ఎందుకులేండి. ఇప్పుడు ఏమన్నా మాట్లాడినా లేనిపోని వివాదాలు వస్తాయి. అందుకే వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎక్కువగా మాట్లాడను..” అని చెప్పుకొచ్చింది. అలా మొత్తానికి ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉంటుంది? పెద్ద వాళ్లు ఎలా అంటే అలా చేయాల్సిందే అనే పరిస్థితి ఉంటుందని చెప్పకనే చెప్పేసింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -