Women: ఇద్దరి మహిళల మధ్య ఆసక్తికర పోరు… ప్రజలు ఎటువైపు…!

Women:ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనంతపురం జిల్లాకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ జిల్లా నుండి ఎంతోమందికి ఎలక నేతలు రాజకీయాల్లోకి అడుగు పెట్టి వివిధ స్థానాలు, వివిధ హోదాల్లో పని చేశారు. ఎందరో కీలక నేతలు అనంతపురం జిల్లా నుండి వచ్చారు. అందుకే ఎప్పుడూ కూడా అనంతపురం రాజకీయాలు హైలైట్ అవుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం అనంతపురం జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం లోని రాజకీయం ఆసక్తికరంగా మారింది.

 

ప్రత్యర్థిని బట్టి అభ్యర్థుల మార్పు చేస్తుండటంతో ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయి. ఇన్నాళ్లూ పెనుకొండలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పార్థసారథికే టికెట్ వస్తుందని అందరూ అనుకున్నారు. అనూహ్యంగా మంత్రి ఉషశ్రీ పెనుకొండ నుంచి పోటీకి దిగడంతో… టీడీపీ కూడా అభ్యర్థిని మార్చాల్సి వచ్చింది. ఇక్కడ ఉషశ్రీకి పోటీగా ఆమె సామాజిక వర్గానికే చెందిన.. సవితమ్మను బరిలో దింపనుంది తెలుగుదేశం.

ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలు ప్రధాన రాజకీయ పార్టీల నుంచి బరిలో దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది.అయితే ఉషశ్రీ చరణ్ గతంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు అయితే ఇప్పుడు నియోజకవర్గాల అభ్యర్థులు మార్పులో భాగంగా జగన్ ఈమెను పెనుకొండ కి మార్చారు.

 

ఇలా అభ్యర్థులు మార్పు కొత్త అభ్యర్థుల పేర్లు తెరమీదకి రావడంతో పెనుకొండ ప్రజలు కూడా ఈ రాజకీయాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఉషశ్రీ చరణ్ కి మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అయితే పోటీకి నిలబడే ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గం కావడంతో ఇక్కడ ఎవరు నెగ్గుతారు అనేది స్పష్టంగా చెప్పలేకపోవచ్చు. అయితే కమ్మ సామాజిక వర్గం కాకుండా మిగతా సామాజిక వర్గాల ప్రజల ఓట్లు బట్టి ఇక్కడ అభ్యర్థి గెలుపు ఉంటుంది. అయితే ప్రజలు ఎటువైపు మొగ్గుతారు అనేది రానున్న రోజుల్లో తెలియనుంది. అయితే గతంలో పోలిస్తే అనంతపురం జిల్లాలో టిడిపి బాగా బలపడిందనే చెప్పాలి. ఉషశ్రీ చరణ మంత్రిగా పనిచేసిన కూడా ఆమె ప్రభావం జిల్లా మొత్తం మీద లేకుండా పోయింది. కేవలం ఆమె నియోజకవర్గంలో మాత్రమే ఆమె ప్రభావం కనిపించేది. ఇప్పుడు అక్కడ కూడా వ్యతిరేకత ఎదురవడంతో జగన్ ఆమె స్థానాన్ని మార్చేశారు. ఇప్పుడు నియోజకవర్గ మారడంతో ప్రస్తుతం పెనుకొండలో ఉన్న వైసీపీ క్యాడర్ ఉషశ్రీ చరణ్ వైపు మొగ్గు చూపుతారా అనేది కూడా అనుమానంగానే చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -