మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపుల వల్ల సూసైడ్ చేసుకున్న మహిళ.. ఏం జరిగిందంటే?

ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది బెదిరింపులు కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది. సాటి మనుషుల పట్ల కనీసం మానవత్వం లేకుండా బెదిరింపులకు పాల్పడటంతో దిక్కుతోచని స్థితిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుని మరణించిన ఘటన వెలుగులోకి వచ్చింది.కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన వెంకటరమణ, భార్య సూర్యకుమారి వారు కుమారుడు, కుమార్తెతో కలిసి హైదరాబాద్ ఫిలిం నగర్ లో నివాసం ఉంటున్నారు.వీరి కుమారుడు స్కూటీ తీసుకొని బయటకు వెళ్ళగా ఫిలింనగర్ సమీపంలోని దర్గా వద్ద ఈయన స్కూటీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కారుకు ఢీ కొట్టింది దీంతో కారు డ్రైవర్ ఆ కుర్రాడి స్కూటీ తాళాలు లాక్కున్నారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో బుగ్గన రాజేంద్రనాథ్ కారులో తన కుటుంబ సభ్యులు ఉన్నారు అయితే డ్రైవర్ తన స్కూటీ కీస్ తీసుకోవడమే కాకుండా స్కూటీతో గుద్దినందుకు తనకు 20వేల రూపాయలు చెల్లించాలని కోరారు. అయితే తన వద్ద అంత డబ్బు లేదని చెప్పిన వినకుండా స్కూటీతో పాటు ఆ బాలుడిని కూడా ఇంటికి తీసుకువెళ్లిపోయారు..

ఇక ఈ విషయం ఆ బాబు తండ్రి తన తల్లికి ఫోన్ చేసి చెప్పగా ఆమె ఎంతో మధన పడ్డారు. ఒక్కసారిగా 20000 రూపాయలు చెల్లించ మంటే ఎక్కడ నుంచి తీసుకు వస్తామని అంత స్తోమత మాకు లేదని తెలిపారు అంతా ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా కడతామని వారు వేడుకున్నప్పటికీ బుగ్గన సిబ్బందికి ఏమాత్రం కరుణ చూపలేదు.

20000 ఒకేసారి చెల్లించి తీసుకువెళ్లాలని లేకపోతే తన కొడుకు పై కేసు పెడతామని తెలిపారు. తన కొడుకు మైనర్ కావడంతో లైసెన్స్ కూడా లేదని పోలీస్ కేస్ అయితే తన కుమారుడు బయటకు కూడా రారని బెదిరించారు. ఇలా తన కొడుకు పట్ల బుగ్గన సిబ్బంది ఈ స్థాయిలో బెదిరించడంతో ఆందోళన చెందిన ఆ తల్లి తన కొడుకు తనకి ఎక్కడ దూరం అవుతాడో అని మదనపడి చివరికి ఆమె ఆత్మహత్య చేసుకుని మరణించిన ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -