Instagram: ఇంస్టాగ్రామ్ లో పరిచయం.. ఇంటికి పిలిపించి మరీ అలా?

Instagram: సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత చాలామంది యువత చెడిపోయారని చెప్పవచ్చు. ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్లలో చాట్ చేసుకోవడం ఒకరి ముఖాలు ఒకరు తెలియకపోయినా కూడా రిలేషన్షిప్ లవ్ అంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఇలా ఎంతోమంది ఆన్లైన్ ద్వారా ప్రేమించుకోవడం ఆ తర్వాత మోసపోయామని గుర్తించి పోలీసులను ఆశ్రయించిన ఘటనలు గతంలో చాలానే జరిగాయి. చాలామంది కేటుగాళ్లు ఈ ఆన్లైన్ ద్వారా మోసాలకు పాల్పడుతూ చివరికి చంపడానికి కూడా వెనకాడడం లేదు.

తాజాగా కూడా ఇలాంటి దారుణం ఒకటి చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే సురేష్ అనే యువకుడు అమ్మాయిలతో పరిచయాలు ఏర్పార్చుకోవాలనే ఉద్దేశ్యంతో తన ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్ పిక్చర్ లో వేరే అందమైన యువకుడి ఫోటోను పెట్టుకున్నాడు. అలా నగరంలోని మూసాపేటకు చెందిన ఒక యువతి ఆ యువకుడి ఫొటోకు లైక్ కొట్టింది. ఆ తరువాత చాటింగ్ చేసుకుని ఒకరికి ఒకరు ఫోన్ నెంబర్లు ఇచ్చుకున్నారు. సురేష్ ఆ అమ్మాయికి మాయమాటలతో బుట్టలో వేసుకున్నాడు. అలా సురేష్ మాటలు నిజం అని నమ్మింది ఆ యువతి. అలా వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

 

కొంతకాలం గడిచిన తరువాత ఆ యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సురేష్ ని ఇంటికి ఆహ్వానించింది. ఇదే అదనుగా బావించిన సురేష్ అమ్మాయి ఇంటికి వెళ్లాడు. అమ్మాయితో మాటలు కలిపి తనకు కూల్ డ్రింక్ కావాలని కోరాడు. పరిచయమున్న వ్యక్తే కదా అని షాప్ కు వెళ్లింది. ఆ యువతి బయటికి వెళ్లగానే బీరువాలో ఉన్న ఆరు తులాల బంగారాన్ని దొంగిలించాడు. యువతికి అనుమానం రాకుండా మళ్లీ కలుద్దామని చెప్పి వెళ్లిపోయాడు. మళ్లీ కొన్ని రోజులకు యువతి సురేష్ ను ఇంటికి పిలిచింది. ఈ సారి ఏకంగా 20 తులాల బంగారాన్ని కాజేసి వెళ్లిపోయాడు. కొన్ని రోజులు గడిచిన తరువాత ఆ యువతి తల్లి బీరువాను సర్ధే క్రమంలో నగలు చోరికి గురయ్యాయని గుర్తించింది. ఇంట్లో ఉన్న కూతుర్ని నిలదీయగా అసలు విషయం చెప్పింది. దీంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం చేసినట్లు అంగీకరించాడు. ఆ యువకుడి నుంచి 26 తులాల బంగారాన్ని రికవరీ చేసి జైలుకు తరలించారు పోలీసులు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -