Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు బీజేపీ నుంచి పిలుపు

Jr NTR:  యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కు మళ్లీ బీజేపీ నుంచి పిలుపు వచ్చింది. ఆర్ఆర్ఆర్ లో తన నటనతో ఎన్టీఆర్ ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇమేజ్ పాన్ ఇండియా లెవల్ కి వెళ్లింది. సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియాకు కూడా ఎన్టీఆర్ కు ఇమేజ్ పెరిగిపోయింది. దీంతో ఎన్టీఆర్‌పై బీజేపీ కన్ను పడింది. తారక్ ను తమ పార్టీకి అనుకూలంగా మార్చుకునేందుకు కాషాయ పార్టీ ప్రయత్నాలు చేస్తోన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సౌత్ ఇండియాలో ఎన్టీఆర్ ఇమేజ్ ను వాడుకుని బలపడాలని బీజేపీ చూస్తోన్నట్లు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే తెలుస్తోంది.

గతంలో హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సమయంలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా నుంచి ఎన్టీఆర్ కు అనూహ్యంగా ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆర్ఆర్ఎర్ లో ఎన్టీఆర్ నటన అమిత్ షాకు నచ్చి అభినందనలు తెలిపేందుకు పిలిచారని కాషాయ శ్రేణులు చెప్పారు. కానీ ఫోన్ చేసి అభినందనలు చెప్పవచ్చని, దాని కోసం కలవాల్సిన పనిలేదని కొంతమంది అంటున్నారు. ఈ భేటీ వెనుక రాజకీయ కోణం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తోన్నాయి. తెలంగాణలో బలపడాలని చూస్తోన్న బీజేపీ.. టీడీపీ క్యాడర్, సెటిలర్ల ఓట్ల కోసం ఎన్టీఆర్ తనవైపు ఉన్నారని అమిత్ షా భేటీ ద్వారా చెప్పుకునే ప్రయత్నం చేసిందనే చర్చ జోరుగా జరిగింది.

అయితే మరోసారి ఎన్టీఆర్‌కు బీజేపీ నుంచి ఆహ్వానం అందింది. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ఎన్టీఆర్ ను ఆహ్వానించింది. కర్ణాటక అసెంబ్లీలో జరిగే దివంగత కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ స్మారక కార్యక్రమానికి రావాల్సిందిగా కర్ణాటక ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ కు ఆహ్వానం వచ్చింది. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక్క ఎన్టీఆర్ కు మాత్రమే ఆహ్వానం అందింది. తమిళనాడు నుంచి రజనీకాంత్ కు మాత్రమే ఆహ్వానం వెళ్లింది. టాలీవుడ్ లో నందమూరి బాలయ్యతో మెగా ఫ్యామిలీతో కూడా పునీత్ రాజ్ కుమార్ కు మంచి పరిచయలు ఉన్నాయి. కానీ ఒక్క ఎన్టీఆర్ కు మాత్రమే బీజేపీ ప్రభుత్వం నుంచి ఆహ్వానం రావడం చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్ లో తనకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని, ఆయన తనకు మంచి ఫ్రెండ్ అని పునీత్ రాజ్ కుమార్ పలుమార్లు తెలిపారు.

పునీత్ రాజ్ కుమార్ తో అత్యంత సన్నిహిత్యం ఉండటం వల్లనే ఎన్టీఆర్ ను కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానించిందని కొంతమంది అంటున్నారు. కానీ దీని వెనుక రాజకీయం ముండిపడి ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ తమకు అనుకూలమని చెప్పేందుకే బీజేపీ టాలీవుడ్ నుంచి తారక్ ఒక్కడినే పిలిచిందని అంటున్నారు. మరోసారి ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకిలాగే ప్రయత్రం బీజేపీ చేస్తోందని అంటున్నారు. 2023లో తెలంగాణలో పాటు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. దీంతో ఎన్టీఆర్ ఛరిస్మాను ఉపయోగించుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉందని చెబుతున్నారు. సౌత్ ఇండియాలో ఎన్టీఆర్ ఇమేజ్ ను ఎలాగైనా వాడుకోవాలని బీజేపీ చూస్తోందని, అందులో భాగంగానే టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్ ను మాత్రమే పిలిచిందని అంటున్నారు. దీని వల్ల తెలంగాణలో అధికారంలోకి రావాలన్న బీజేపీకి కూడా కలిసొస్తుందనే ఆశలు పెట్టుకుందిజ

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -