IPL: కమిన్స్ గ్రీన్ సిగ్నల్.. ఐపీఎల్ వేలంలోకి కామెరూన్ గ్రీన్

IPL: వివిధ దేశాలలో టీ20 లీగ్‌ల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని జట్లలో ఆటగాళ్లపై ఒత్తిడి పడుతోంది. ఈ కారణంగా వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్ సీజన్‌లో ఆడకూడదని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నిర్ణయం తీసుకున్నాడు. అయితే మిగతా ఆటగాళ్లపై ఆంక్షలు పెట్టడం లేదని.. వాళ్లు కావాలనుకుంటే ఐపీఎల్‌లో ఆడొచ్చని కమిన్స్ తెలిపాడు. తాను కెప్టెన్ అయినప్పటికీ తమ ఆటగాళ్లకు ఐపీఎల్‌లో పాల్గొనే అవకాశాన్ని వదులుకోవాలని చెప్పలేనని తెలిపాడు.

 

ప్యాట్ కమిన్స్ ప్రకటనతో ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ వచ్చే నెలలో జరిగే ఐపీఎల్ మినీ వేలంలో పాల్గొనే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు డేవిడ్ వార్నర్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో అతడి స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన గ్రీన్ ఆల్‌రౌండర్ నైపుణ్యాలతో ఆకట్టుకున్నాడు. ఫీల్డింగ్, బౌలింగ్‌లోనూ రాణించడంతో ఏకంగా టీ20 ప్రపంచకప్‌లో స్థానం సంపాదించాడు. అయితే మెగా టోర్నీలో ఆశించిన విధంగా రాణించలేకపోయాడు.

 

టీ20 ప్రపంచకప్‌లో రాణించకపోయినా కామెరూన్ గ్రీన్‌పై ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్నేశాయి. అతడిని వేలంలో మంచి ధరకు దక్కించుకోవాలని భావిస్తున్నాయి. టీ20 లీగ్ వేలంలోకి రావాలని గ్రీన్ భావిస్తే అతడి కోసం భారీగా బిడ్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో గ్రీన్ ఆడుతున్నాడు. ఇంగ్లండ్‌తో అడిలైడ్‌లో జరిగిన తొలి వన్డేలో గ్రీన్ అజేయంగా 20 పరుగులు చేశాడు.

 

గాయపడ్డ గ్రీన్.. రెండో వన్డేకు దూరం
23 ఏళ్ల కామెరూన్ గ్రీన్ తొలి వన్డే తర్వాత ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో సిడ్నీలో జరిగిన రెండో వన్డేకు దూరమయ్యాడు. అతడు పెర్త్‌ వెళ్లిపోవడంతో మెల్‌బోర్న్‌లో జరిగే మూడో వన్డేకు కూడా దూరమైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. అతడి స్థానంలో మిచెల్ మార్ష్ జట్టులోకి వచ్చాడు. ఈనెల 30 నుంచి వెస్టిండీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు గ్రీన్ అందుబాటులో ఉంటాడని అధికారులు వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -