AB de Villiers: ఐపీఎల్ మా జీవితాలను పూర్తిగా మార్చేసింది: ఏబీ డివిలియర్స్

AB de Villiers: క్రికెట్ స్వరూపాన్నే మార్చేసిన లీగ్ గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను చెప్పొచ్చు. జాతీయ జట్లకు ఆడుతూ యాడ్స్ ద్వారా సంపాదిస్తున్న క్రికెటర్లకు అంతగా ఆదాయం ఉండేది కాదు. అలాంటి సమయంలో కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుక్కోవడం ద్వారా ఆటగాళ్లను కోట్లకు పడగలెత్తేలా చేసింది ఐపీఎల్. అదే సమయంలో ఊరూ, పేరూ తెలియని ప్లేయర్లకు డబ్బులతోపాటు జాతీయ జట్లలో ఆడేలా అవకాశాలు రావడంలోనూ ఈ లీగ్ ఎంతో ఉపయోగపడింది.

 

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కూడా ఐపీఎల్ ఓ బంగారు బాతులా తయారైంది. బోర్డుకు వచ్చే ఆదాయంలో దాదాపుగా 70 శాతం వరకు ఈ లీగ్ నుంచే సమకూరుతోంది. అందుకే ఆటగాళ్లు ఇందులో ఆడేలా చేస్తూ.. నేషనల్ క్రికెట్ కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమనేలా వ్యవహరిస్తోందంటూ పలు విమర్శలను కూడా మూటగట్టుకుంటోంది. ఇక ఐపీఎల్ ద్వారా మన దేశ క్రికెటర్లే గాక విదేశీ ఆటగాళ్లు కూడా ఎంతో డబ్బులను వెనకేసుకున్నారు.

 

ఐపీఎల్ తో నేమ్, ఫేమ్, క్యాష్​ సంపాదించుకున్న ఫారిన్ క్రికెటర్లలో ఏబీ డివిలియర్స్ ఒకరు. ఈ మిస్టర్ 360‌‌ డిగ్రీ ప్లేయర్ ఆటగాడు ఐపీఎల్లో ఎన్నో అద్భుతమైన విన్యాసాలతో అభిమానుల మనసు దోచుకున్నాడు. గతేడాది రిటైర్మెంట్ ప్రకటించే సమయం వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడుతూ అలరించాడు. తాజాగా ఐపీఎల్ ప్రారంభ రోజుల్లో తన జ్ఞాపకాలను అతడు నెమరేసుకున్నాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్లలో ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ గ్లెన్ మెక్ గ్రాత్ తో డ్రెస్సింగ్ రూమ్ ను పంచుకోవడం అనేది జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని ఘటన అని డివిలియర్స్ తెలిపాడు.

 

‘ఐపీఎల్ నా లాంటి ఎంతోమంది క్రికెటర్ల జీవితాలను పూర్తిగా మార్చేసింది. క్రికెట్ మీద ప్రజలు ఎంతో ప్రేమను చూపుతున్నారు. స్వదేశీ జట్లతోపాటు ఇతర టీమ్స్ లోని ప్లేయర్స్ కు కూడా సపోర్ట్ చేయడం నిజంగా గొప్ప విషయం. గ్లెన్ మెక్ గ్రాత్ తో ఐపీఎల్లో కొంత సమయం గడిపా. అప్పుడు అనుకోకుండా అతడితో కలసి డ్రెస్సింగ్ రూమ్ లో బీర్ తాగా’ అని డివిలియర్స్ మునుపటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -