iQOO 11: అదిరిపోయే ఫీచర్స్ తో భారత మార్కెట్లోకి ఐక్యూ 11 స్మార్ట్ ఫోన్?

iQOO 11: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఐక్యూ భారత మార్కెట్లోకి ఇప్పటికే ఎన్నో మంచి మంచి ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్లను అతి తక్కువ ధరకే మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు సరికొత్త మొబైల్స్ ని మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉంది ఇక్యూ సంస్థ. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇక్యూ సంస్థ మార్కెట్ లోకి ఐక్యూ 11 స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. తాజాగా నిన్న అనగా జనవరి 13వ తేదీ నుంచి ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్లు ధర విషయానికి వస్తే..

 

ఐక్యూ 11 8 జీబీ ర్యామ్‌ 256 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 59,999గా ఉంది. అలాగే 16 జీబీ ర్యామ్‌ 256 జీబీ స్టోరేజ్‌ వేరయింట్ ధర రూ. 64,999గా ఉంది. కానీ ఆఫర్‌లో భాగంగా భారీ డిస్కౌంట్‌కి లభిస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌లో రూ. 1000 ఫ్లాట్ డిస్కౌంట్‌ పొందొచ్చు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.78 ఇంచెస్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టుతో 2K E6 ప్యానెల్‌తో వస్తోన్న తొలి మొబైల్ ఇదే కావడం విశేషం.

 

అలాగే కెమెరా విషయానికొస్తే.. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. 50 మెగాపిక్సెల్‌ సామ్‌సంగ్‌ GN5 లెన్స్, 13 ఎంపీ టెలిఫోటో లెన్స్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో, స్పాట్‌లెస్ సెల్ఫీలను క్యాప్చర్ చేసేందుకు 16 మెగాపిక్సెల్‌ స్నాపర్‌ను అందించారు.బెస్ట్ గేమింగ్ అనుభూతిని అందించేందుకు డ్యూయల్ x లీనియర్ మోటార్‌ను అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5000mAh బ్యాటరీని సామర్ధ్యం ను కలిగి ఉండనుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -