Hari Hara Veera Mallu: ఏఎం రత్నం ఆ తప్పు చేస్తున్నారా.. అందుకే సమస్యలా?

Hari Hara Veera Mallu:టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పవర్ స్టార్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే పవన్ వినోదయ సీతమ్ సినిమా షూటింగ్ ని పూర్తి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ మొదలు పెట్టారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఒక 40 రోజులు కాల్ షీట్స్ ఇచ్చినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఈ మూవీ తర్వాత సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ మే నెలలో ప్రారంభం కాబోతుంది. ఈ సినిమా షూటింగ్ ని ఇంగ్లాండ్ లో చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాను ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ ఈ సినిమా వాయిదా పడుతూనే వస్తోంది. ఇప్పటికే షూటింగ్ని పూర్తిచేసుకుని విడుదల కావాల్సిన ఈ సినిమా ఇంకా షూటింగ్ ని జరుపుకుంటూనే ఉంది.

ఇప్పటికే దాదాపుగా సగానికి పైన షూటింగ్ పూర్తి కాగా కొన్ని కీలక సన్నివేశాలు ఇంకా షూట్ చేయాల్సి ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో భారీ బడ్జెట్ తోనే నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. అయితే సినిమా పదే పదే వాయిదా పడుతూ ఉండటంతో గత రెండేళ్ళుగా షూటింగ్ నడుస్తూనే ఉంది. దీంతో ఈ మూవీ అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయిపోయిందని ఈ కారణంగా ఆర్ధిక ఇబందుల కారణంగా షూటింగ్ వాయిదా పడింది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నిర్మాత ప్రస్తుతం ఆర్థికంగా చూసుకుంటున్నారని దాంతో పవన్ కళ్యాణ్ ఇతర సినిమాలను షూటింగ్ చేసే పనిలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమాకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవు అనుకుంటే ఈ సినిమాను ఏడాది ఆఖరిలోపు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -