Balayya Son: సినిమాల్లో బాలయ్య కొడుకు సంచలనాలు సృష్టించడం ఖాయమేనా?

Balayya Son: టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య బాబు అభిమానులతో పాటు నందమూరి అభిమానులు అందరూ కూడా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే మోక్షిత్నే ఎంట్రీ ఇచ్చేది ఈ సినిమాతోనే ఆ సినిమాతోనే అంటూ గతంలో అనేక రకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. కానీ అవన్నీ కూడా వట్టి రూమర్స్ అని తేలిపోయాయి. అదేవిధంగా మోక్షజ్ఞ ఎంట్రీ పై అనేక రకాల వార్తలు వినిపిస్తున్నప్పటికీ బాలయ్య బాబు కూడా ఆ వార్తలపై స్పందించడం లేదు.

తాజాగా మోక్షజ్ఞ మూవీ ఎంట్రీ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూంది. మోక్షజ్ఞ త్వరలోనే ఒక సినిమాలో నటించబోతున్నాడని ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం పూర్తయిపోయిందని ఒక సూపర్ స్టోరీని మోక్షజ్ఞ కోసం బాలయ్య రాయించాడని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక నందమూరి మోక్షజ్ఞకు ఫస్ట్ సినిమాతోనే భారీ సక్సెస్ దక్కేలాగా బాలయ్య జాగ్రత్తలు తీసుకున్నాడట. యూత్ కు కనెక్ట్ అయ్యేలా పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన మరొక ఆసక్తికరమైన వార్త కూడా వినిపిస్తుంది. మోక్షజ్ఞతో పాటు ఈ సినిమాలో బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణి కొడుకు దేవాన్ష్ కూడా ఒక కి రోల్ ను ప్లే చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

 

ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం నందమూరి, నారా ఫ్యాన్స్ కి పండగే అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడంతో ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో బాలయ్యను తీసుకోవాలనుకున్నారట మూవీ మేకర్స్. బాలయ్య ఆ రోల్ కి మలయాళ యాక్టర్ మోహన్ లాల్ గారు కరెక్ట్ గా సెట్ అవుతారు ఆయననే ఈ రోల్ కు తీసుకోవడం కరెక్ట్ అని చెప్పాడట. దీంతో మోహన్ లాల్ ని టీం కలిసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మోక్షజ్ఞ సినిమాలో మోహన్ లాల్ కూడా ఉంటే మొదటి సినిమాతోనే ఒక స్టార్ నటుడితో మోక్షజ్ఞ కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లే. ఈ సినిమా ఇప్పటికే పూర్తి అయ్యిందని ఈ ఏడాది ఆఖరిలోపు విడుదల కాబోతుందని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -