Balayya: ఆ లెక్క ప్రకారం నంబర్ వన్ బాలయ్య మాత్రమేనా?

Balayya: ఒకప్పుడు సినిమా ప్రారంభానికి ముందు క్లాప్ కొడితే, ఆ మూవీ రిలీజ్ ఫంక్షన్ అయితున్నప్పుడే హడావుడి ఉండేంది.ఇప్పుడు అలా కాదు, సినిమా ప్రారంభం నుంచి రిలీజ్ అయి, హిట్టా పట్టా వరకు అబ్డేట్లు వస్తూనే ఉంటాయి. ఇక ఉగాది పండుగ కానుకగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలలో చాలా సినిమాలకు సంబంధించి క్రేజీ అప్ డేట్స్ వచ్చాయి. అయితే ఉగాది పోస్టర్లలో టాప్ పోస్టర్ ఏదనే ప్రశ్నకు మాత్రం బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ పోస్టర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. లుక్స్ విషయంలో బాలయ్య మాత్రమే కింగ్ అయ్యారని ఫ్యాన్స్ చెబుతున్నారు.

బాలయ్యతో ఫుల్ లెంగ్త్ మాస్ మసాలా మూవీని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుండగా రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. కాజల్, శ్రీలీల ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీలీల ఏ ప్రాజెక్ట్ లో నటించినా ఆ ప్రాజెక్ట్ సక్సెస్ సాధిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 

ఇక వీరసింహరెడ్డి భారీ హిట్ తో పారితోషం కూడా భారీగానే పెంచేశాడు బాలయ్య. బాలయ్య పారితోషికం ఈ మూవీకి ఓ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. బాలయ్య ఒక్కో సినిమాకు 20 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకుంటున్నారు. వరుస మాస్ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న బాలయ్య సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -