Nagarjuna: సెలబ్రిటీలు చనిపోతే నాగ్ వెళ్లకపోవడానికి కారణమిదేనా?

Nagarjuna: సినీ ఇండస్ట్రీలో మంచి చెడులను పంచుకునేవారు ఒకరికొకరు ఉంటారు. ఒకరింట్లో జరిగే కార్యక్రమానికి మరోకరు వెళ్తుంటారు. లేదా ఎవరైనా చనిపోతే వెళ్లి చనిపోయిన వారి కుటుంబీకులను పరామర్శిస్తుంటారు. అయితే టాలీవుడ్ కింగ్ అయిన నాగార్జున మాత్రం ఎవరు చనిపోయినా చివరిచూపు చూడటానికి వెళ్లరు. చాాలా ఏళ్లుగా నాగ్ అలానే వ్యవహరిస్తుండటం గమనార్హం.

కారణం ఏంటో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయంలో గురించే అటు సినీ ఇండస్ట్రీలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ చర్చ జోరుగా సాగుతోంది. ఆ మధ్యోసారి కృష్ణ గారు చనిపోయినప్పుడు కూడా నాగార్జున వెళ్లకపోవడంపై చాలా కామెంట్స్ వినిపించాయి. ఆయన కుటుంబంలో మాత్రం అక్కినేని నాగేశ్వరరావు కన్ను మూసినా ఆయన సతీమణి అన్నపూర్ణమ్మ కన్ను మూసినా చాలా మంది వందల్లో, వేలల్లో అక్కడికి తరలి వెళ్లారు. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్లి సంతాపం తెలిపింది. కానీ నాగార్జున ఎందుకు ఎవరు కన్ను మూసినా ఆఖరి చూపుకు వెళ్లడం లేదనేది పెద్ద ప్రశ్నగానే ఉంది.

ఆ ఒక్క విషయంలో తప్పా పెళ్లిళ్లకు, ఫంక్షన్స్ కి, పార్టీలకు నాగార్జున తప్పుకుండా వెళ్లి వస్తుంటారు. కొంత మంది పెళ్లిళ్లకు కుటుంబ సమేతంగా నాగ్ వెళ్లడం మనం చూశాం. కొంతలో కొంత నాగార్జున ఎవరైనా చనిపోతే వెళ్ళింది అంటే, ఒక్క దాసరి ఇంటికి మాత్రమే అని చెప్పొచ్చు. దాసరి నారాయణ రావు భార్య పద్మ చనిపోతే ఆ తర్వాత మూడవ రోజు వెళ్లి దాసరిని ఆయన కలిశారు.

నాగార్జున సంగతి పక్కన పెడితే ఆయన కుమారులు అయిన నాగ చైతన్య, అఖిల్ మాత్రం నాగార్జున వైఖరికి పూర్తిగా భిన్నం అని చెప్పాలి. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూస్తే చైతు వెళ్లి ఆఖరి చూపు చూసి మహేష్ బాబుని ఓదార్చి వచ్చారు. అఖిల్ కూడా అప్పడప్పుడూ కొన్ని కార్యాలకు వెళ్లి రావడం చూశాం. కానీ నాగ్ మాత్రం ఇలా ఎందుకు చేస్తున్నారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -