Health Tips: ఈ 5 చిట్కాలు పాటిస్తే చాలు.. వేసవిలో ఆరోగ్యంగా ఉండడం ఖాయం?

Health Tips: వేసవికాలం మొదలయ్యింది.. ఎండలు మండిపోతున్నాయి. కాబట్టి ఆరోగ్యం బాగా ఉండాలి అన్న శరీరం డిహైడ్రేషన్ కాకుండా ఉండాలి అన్న తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఐదు రకాల చిట్కాలను తప్పనిసరిగా పాటించాలి. మరి ఆ ఐదు రకాల చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వీలైనంతవరకూ ఎండాకాలంలో ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. శరీరం హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం కోసం ద్రవ పదార్థాలు తీసుకోవడం తప్పనిసరి. మరి ముఖ్యంగా ఏదైనా శారీరక శ్రమ చేసినప్పుడు చెమటలు పట్టడం సర్వసాధారణం.

ఆ సమయంలో చెమట రూపంలో శరీరం నుండి నీరు కోల్పోతుంది. అందుకే నీరు, ఇతర ద్రవ పదార్ధాలను పుష్కలంగా త్రాగటం ముఖ్యం. ప్రతిరోజు 8 గ్లాసుల నీటిని తీసుకోవాలి. హైడ్రేటెడ్ శరీరం మరింత శక్తివంతంగా ఉంటుంది. అలసటను నివారించడంలో మెరుగైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. డయేరియా, టైఫాయిడ్, కలరా, హెపటైటిస్ ఏ లేదా ఈ వంటి అనేక వేసవి వ్యాధులు నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు. కాబట్టి పరిశుభ్రమైన నీటిని తాగడం చాలా ముఖ్యం. అలాగే వేసవిలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఈ కాలంలో లభించే పండ్లు, కూరగాయలను తప్పక తీసుకోవాలి.

 

దీంతో శరీరానికి తగినన్ని పోషకాలు లభిస్తాయి. సలాడ్లు, జ్యూస్‌లు, పెరుగు, సీజనల్ పండ్లు, మొలకలను ఆహారంలో చేర్చుకోవాలి. స్పైసీ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. మసాలా వంటలు ఇష్టపడ్డా ఎండాకాలంలో వాటికి దూరంగా ఉండడమే మంచిది. ఇవి తీసుకుంటే వేసవి కాలంలో జీర్ణవ్యవస్థ పై దుష్ప్రభావాన్ని కలిగిస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలను నివారించడానికి తక్కువ నూనెతో తయారు చేసిన వంటలు తీసుకోవాలి. సరైన విశ్రాంతి తీసుకోండి వేసవి రోజుల్లో శరీరం త్వరగా అలసిపోతుంది. ప్రతిరోజు 7 నుండి 9 గంటలు నిద్రపోవాలి.. అలాగే రాత్రి భోజనంలో తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి.

 

సూర్యుని నుండి రక్షణ వేసవిలో సూర్యుడు నిప్పులు చెరుగుతుంటాడు. తద్వారా చర్మసంబంధితం సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యకరమైన చర్మం కోసం ఇంటి నుండి బయటికి వచ్చినప్పుడల్లా సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. అలాగే బయటకు వెళ్ళినప్పుడు గొడుగు లేదంటే టోపీ లాంటివి పెట్టుకోవడం మంచిది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -