Health Tips: నిద్రపోయేముందు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Health Tips: మామూలుగా మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఎన్నోసార్లు నీటిని తాగుతూ ఉంటాము. ఇంటిపట్టున్న ఉండే వారితో పోల్చుకుంటే బయట ఎండలో కష్టపడి పని చేసేవారు ఎక్కువ నీటిని తాగుతూ ఉంటారు. రాత్రి సమయంలో పడుకునే ముందు కొంతమందికి మీరు తాగే అలవాటు ఉంటే మరి కొంతమందికి అర్ధరాత్రి సమయంలో దాహం వేసినప్పుడు లేచి నీరు తాగుతూ ఉంటారు. అందుకే చాలామంది రాత్రి పడుకునే సమయంలో పక్కన నీళ్లు పెట్టుకుని పడుకుంటూ ఉంటారు. 10 లో 8 మందికి రాత్రి సమయంలో మీరు తాగే అలవాటు ఉంటుంది.

అయితే పడుకునే ముందు నీళ్లు తాగే వారు ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి అంటున్నారు నిపుణులు. అదేమిటంటే పడుకునే ముందు మీరు ఎంత మీరు తాగుతున్నారు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలట. రాత్రి సమయంలో మీరు పడుకునే రెండు గంటల ముందు నీరు తాగడం మానేయాలని అంటున్నారు డాక్టర్స్. అలాగే రాత్రి సమయంలో చాలామందికి మూత్ర విసర్జన చేసే అలవాటు కూడా ఉంటుంది.. కాబట్టి ఒకేసారి బెడ్ ఎక్కే ముందు వాష్ రూమ్ లోకి వెళితే మళ్ళీ మధ్యలో వెనుక రాకుండా ఉంటుంది.

 

పడుకున్న తర్వాత మధ్యలో మీ నోరు ఎండిపోయినట్లు అనిపించినా లేదా మీరు రాత్రిపూట మందులు వేసుకోవాల్సిన అవసరం వచ్చినా కొంచెం నీరు ఫర్వాలేదు. సాధారణంగా నిద్రవేళకు ముందు చివరి రెండు గంటలలో ఒక గ్లాసు కంటే తక్కువ నీరు త్రాగాలి. ఎందుకంటే హైడ్రేటెడ్‌గా ఉండటం ముఖ్యం. కానీ రాత్రి విశ్రాంతి తీసుకోవడం కూడా అంతే కీలకం. నీరు ఎక్కువగా తాగితే నిద్రకు అంతరాయం ఏర్పడుతుంది. దాంతో ఉదయం లేచేసరికి అలసట, నీరసం ఆవహిస్తుంది. నిద్రలేమి రోగనిరోధక వ్యవస్థను నిరోధిస్తుంది. మానసిక ఆరోగ్యం పై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. దాంతో అనేక రకాల సమస్యలు వస్తాయి.

 

జ్ఞాపకశక్తి కోల్పోవడం, అంటువ్యాధులు, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు, బరువు పెరుగుట, క్యాన్సర్ వంటి వ్యాధులు చుట్టుముడతాయి. తరచుగా మూత్రవిసర్జనకు కారణమయ్యే పరిస్థితులు ఏవైనా ఉన్నాయో లేదో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. అలా అయితే, మీరు పడుకునే ముందు నీటిని తీసుకోవడం తగ్గించుకోవాలి. మితంగా నీరు త్రాగటం ఎప్పటికీ ప్రయోజనకరంగా ఉంటుంది. నీరు మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం, కీళ్లను లూబ్రికేట్ చేయడం, వ్యర్థాలను విచ్ఛిన్నం చేయడం వంటి ప్రయోజనాలు నీరు తాగడం వలన కలుగుతాయి. మీ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీరు వేడి వాతావరణంలో ఉన్నట్లయితే, పడుకునే ముందు తాగిన కొంచెం నీరు మీ శరీరాన్ని చల్లబరుస్తుంది. ప్రయోజనకరంగా ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP: అయిదేళ్లలో మూడు రెట్లు పెరిగిన వైసీపీ నేతల ఆస్తులు.. మరీ ఇంత అవినీతిపరులా?

YSRCP: వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నేతల అక్రమాలు మొదలయ్యాయి ఇష్టానుసారంగా చేతికి దొరికినది దోచుకుంటూ సొమ్ము చేసుకున్నారు. 2019 ఎన్నికల ముందు వరకు కనీసం ఆస్తిపాస్తులు లేనటువంటి వారు...
- Advertisement -
- Advertisement -