Raghunandan Rao: టీఆర్ఎస్‌లోకి రఘునందన్ రావు రీ ఎంట్రీ? బీజేపీకి బిగ్ షాక్ తగలనుందా?

Raghunandan Rao: మునుగోడు ఉపఎన్నిక క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో వలసలు విపరీతంగా జరుగుతున్నాయి. ఏ నేత ఏ పార్టీలోకి చేరతున్నారనేది కూడా అర్ధం కాని పరిస్థితుల్లో చేరికలు ఊపందుకున్నాయి. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో అర్ధం కావడం లేదు. అనూహ్యంగా కండువాలు మార్చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోన్న క్రమంలో.. ఆ పార్టీకి రివర్స్ షాక్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ కూడా ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. బీజేపీలోకి కీలక నేతలను తమవైపు తిప్పుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆలూరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ ను బీజేపీ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. గురువారం మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు.

భిక్షమయ్య గౌడ్ కు పార్టీ కండువా కప్పి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. టీఆర్ఎస్ లోచేరిన అనంతరం భిక్షమయ్య గౌడ్ ను కేసీఆర్ తో ప్రగతిభవన్ కు తీసుకెళ్లి కేసీఆర్ ను కలిపించారు. భిక్షమయ్య గౌడ్ కు కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తానంటూ కీలక హామీ ఇచ్చినట్లు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. ఇక శుక్రవారం మాజీ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ తోపాటు దాసోజు శ్రవణ్ బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ చేరారు.

అయతే ఈ సారి ఏకంగా ఓ ఎమ్మెల్యే బీజేపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఆయనెవరో కాదు.. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. తన వాక్చాతుర్యం, వాగ్దాటితో బీజేపీ తరపున బలమైన వాయిస్ వినిపించే నేతల్లో ఆయన ముందు ఉంటారు. ఎప్పటినుంచో ఆయన బీజేపీలో కనసాగుతున్నాయి. ఎలాంటి పదవులు ఇవ్వకపోయినా ఆ పార్టీకి అండగా ఉంటూ కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. కానీ బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీలో ఎప్పటినుంచో ఉన్న నేతలను పట్టించుకోవం లేదని ఆరోపణలు ఉన్నాయి.

దీంతో రఘునందన్ రావు బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం ఎప్పటినుంచో సాగుతోంది. ప్రస్తుతం మునుగోడులో బీజేపీ తరపున ఆయన ప్రచారం చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఆయన మునుగోడులో ఉంటూ బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం పనిచేస్తున్నారు. కానీ నేతలందరూ అనూహ్యంగా రాజీనామా చేసి వేరే పార్టీల్లో చేరుతున్న క్రమంలో బీజేపీలో అసంతృప్తిగా ఉన్న రఘనందన్ రావుకు టీఆర్ఎస్ గాలం వేసిందని చెబుతున్నారు. దీంతో రఘునందన్ రావు బీజేపీలో చేరే అవకాశముందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేసీఆర్ కుటుంబంతో ఆయనకు దూరపు బంధుత్వం ఉంది.

గతంలో రఘనందన్ రావు టీఆర్ఎస్ లో పనిచేశారు. కేసీఆర్ తో రాజకీయ విబేధాల కారణంగా టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. కొన్నేళ్లుగా బీజేపీలోనే కొనసాగుతున్నాయి. దుబ్బాక ఉపఎన్నికలో గెలిచి బీజేపీ తరపున ఎమ్మెల్యే అయ్యారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున రాజాసింగ్ ఒక్కరే గోషామహల్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత పోటాపోటీగా జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో రఘునందర్ రావ ుగెలవంతో బీజపీ తరపున రెండో ఎమ్మెల్యే గెలిచారు.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -