Balayya-Allu Arjun: బాలయ్య బన్నీ కాంబో మూవీకి దర్శకుడు అతనేనా?

Balayya-Allu Arjun: నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా కూడా అప్పుడే విడుదల కానుంది. టాలీవుడ్ లో ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాల హవా నడుస్తోంది. అయితే బాలయ్య కూడా మల్టీ స్టారర్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అందరూ వేచి చూస్తున్నారు. తాజాగా ఓ స్టార్ కాంబో గురించి వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

 

బాలయ్య, అల్లు అర్జున్ కలిసి ఓ సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో బాలయ్య సింహా, లెజెండ్, అఖండ వంటి భారీ సినిమాలు చేసి హిట్స్ సాధించారు. మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తున్న ఈ టైంలో బాలయ్య, అల్లు అర్జున్ నుంచి సినిమా రాబోతోందనే వార్త రావడం ఇప్పుడు వైరల్ అవుతోంది. గతంలో అఖండ సినిమా ఫంక్షన్ లో బోయపాటి శ్రీను కూడా బాలయ్య, బన్నీ కాంబినేషన్ లో సినిమా ఉండొచ్చని తెలిపాడు. కథ ఉంటే తప్పకుండా వారితో సినిమా చేస్తానని తెలిపాడు.

 

తాజాగా సుకుమార్ దర్శకత్వంలో బాలయ్య, బన్నీ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఇదే కనుక నిజమైతే అటు నందమూరి ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ మరోసారి పండుగ చేసుకుంటారని అనిపిస్తోంది. బాలయ్య ప్రస్తుతం అన్ స్టాపబుల్ 2 షో చేస్తున్నారు. ఇది ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతోంది. ఆహా ఓటీటీకి అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఓనర్ కావడంతో త్వరలోనే బన్నీతో బాలయ్య సినిమా ఉండబోతుందని బలంగా వినిపిస్తోంది.

 

అల్లు అర్జున్ కూడా బాలయ్యతో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇకపోతే తనకు నచ్చిన డైరెక్టర్ సుకుమార్ తోనే బన్నీ బాలయ్యతో సినిమాను తెరకెక్కించే అవకాశం ఉంది. మొత్తానికి ఈ వార్త తెలిసిన బాలయ్య, బన్నీ ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. థియేటర్లలో బాలయ్య, బన్నీని చూసి చిందులు వేయడం కచ్చితంగా జరుగుతుందని, వీరి సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నామని అభిమానులు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -