Rajinikanth Daughter: రజనీకాంత్ కూతురు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి అతనేనా?

Rajinikanth Daughter: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో ఐశ్వర్య రజనీకాంత్ ధనుష్ జంట ఒకటి. వీరిద్దరూ ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. దాదాపు 18 సంవత్సరాల పాటు మీరు వైవాహిక జీవితం ఎంతో అన్యోన్యంగా సాగింది. భార్యాభర్తలు అంటే ఇలాగే ఉండాలి అనే విధంగా వీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు.

ఇలా 18 సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో సంతోషంగా కొనసాగిన వీరిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు వచ్చాయో తెలియదు కానీ ప్రస్తుతం వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా తన భర్త నుంచి విడిపోయినటువంటి ఐశ్వర్య తిరిగి మెగా ఫోన్ పట్టుకొని పలు సినిమాలకు దర్శకత్వం వహిస్తూ ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు. ఇక ధనుష్ సైతం పలు సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.

 

ఇలా వీరి వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో బిజీగా ఉండగా తాజాగా ఐశ్వర్య రజనీకాంత్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయినటువంటి ఐశ్వర్య త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. దీంతో ఒక్కసారిగా రజనీకాంత్ అభిమానులు అందరూ షాక్ అయ్యారు.

 

ఈమె కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరోని రెండవ వివాహం చేసుకోబోతున్నారన్న వార్త వైరల్ గా మారింది. ఈ విధంగా తన గురించి ఇలాంటి వార్త రావడానికి గల కారణం ఈమధ్య ఆ హీరోతో కలిసి ఐశ్వర్య ఒక రిసార్ట్ లో కనిపించడమే ఇందుకు కారణం అయింది. ఇలా ఈమె తన భర్తతో విడాకులు తీసుకుని రెండో పెళ్లికి సిద్ధమయ్యారంటూ వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ఈ వార్త మాత్రం అభిమానులను కాస్త విస్మయానికి గురిచేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Jagan- Pawan, Sharmila: ఆ జిల్లాలో ఒకేరోజు జగన్, షర్మిల, పవన్ కళ్యాణ్.. ప్రచారంతో మెప్పించేదెవరో?

Jagan- Pawan, Sharmila: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నాయకులు జనాలలోనే ఉంటూ పార్టీ ప్రచార కార్యక్రమాలను...
- Advertisement -
- Advertisement -