Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబవర్ వన్ అతనేనా.. ఇతర హీరోలు షాకయ్యేలా?

Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు పోటీపడుతూ నువ్వా నేనా అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు హీరోలు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ వంటి హీరోలందరూ కూడా పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ సొంతం చేసుకున్నారు.

ఈ క్రమంలోని ఈ హీరోల అభిమానుల మధ్య తరచూ మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అన్న వివాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి.మరి టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు అన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతూ ఉంటుంది. ఎందుకంటే ఏ హీరో అభిమానులు వారి హీరోనే గొప్ప అంటూ భావిస్తున్నారు. అయితే ఓర్మాక్స్ మీడియా సర్వే ప్రకారం టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు అనే జాబితాను విడుదల చేశారు.

 

ఈ సర్వే ప్రకారం అత్యంత ప్రేక్షకాదరణ కలిగినటువంటి హీరోల జాబితాను విడుదల చేశారు. మరి ఈ జాబితా ప్రకారం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ టెన్ పొజిషన్లో ఉన్నటువంటి హీరోలు ఎవరు ఏ హీరో ఏ పొజిషన్లో ఉన్నారనే విషయానికి వస్తే… టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా చోటు సంపాదించుకున్నారు నటుడు ప్రభాస్. ఈయన ఈ సర్వేలో అత్యంత ప్రేక్షకాదరణ కలిగినటువంటి హీరోగా నెంబర్ వన్ స్థానంలో నిలిచారు.

 

ఇక రెండవ స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడవ స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నాలుగో స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఐదో స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆరో స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏడో స్థానంలో నాచురల్ స్టార్ నాని, ఎనిమిదో స్థానంలో మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదో స్థానంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పదో స్థానంలో మాస్ మహారాజా రవితేజ ఉన్నారు.అయితే ఈ జాబితాలో నెంబర్ వన్ హీరోగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఉండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -