Trisha: త్రిష వెనకుండి నడిపిస్తున్న స్టార్ హీరో అతనేనా?

Trisha: త్రిష ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. హీరోయిన్ గా ఈమె మౌనం పేసియదే అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. ఇలా ఈ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమెకు తమిళంతో పాటు తెలుగులో కూడా ఎన్నో అవకాశాలు వచ్చాయి.తెలుగు తమిళ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన త్రిష దక్షిణాది సినీ ఇండస్ట్రీలోని ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇక ఈమె ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమయంలో పలువురు హీరోలతో ఎఫైర్స్ కొనసాగించింది అంటూ పెద్ద ఎత్తున ఈమె ప్రేమ గురించి కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇలా తన ప్రేమ గురించి ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ చివరికి ఈమె ఒకవ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరుపుకొని అనంతరం తన నిశ్చితార్థాన్ని కూడా క్యాన్సిల్ చేసుకుని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న త్రిష ఇప్పటివరకు పెళ్లి గురించి ఆలోచించకపోవడం వెనుక ఓ కారణం ఉందని తెలుస్తోంది. ఈమె సినిమా ఇండస్ట్రీలో నటీనటులుగా గుర్తింపు పొందిన జయలలిత ఎంజీఆర్ తరహాలోనే తాను కూడా ఇండస్ట్రీలోకి రావాలని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఈమె కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాలలోకి రావడం కోసం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

త్రిష రాజకీయాలలోకి రావడం కోసం ఒక హీరో తననీ ప్రోత్సహిస్తున్నారని ఆ హీరో ప్రోత్బలంతోనే ఈమె రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది.మరి ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే ప్రముఖ కోలీవుడ్ నటుడు విజయ్ త్రిష వెనకుండి తనని రాజకీయాలలో ముందుకు నడిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.ఇకపోతే నటుడు విజయ్ కి కూడా రాజకీయాలంటే ఎంతో ఆసక్తి ఈ క్రమంలోనే త్రిష విజయ్ మధ్య మంచి స్నేహబంధం ఉండడంతో ఆ స్నేహబంధంతోనే తనని రాజకీయాలలోకి ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి త్వరలోనే మరో సినిమా కూడా రానుంది.మరి త్రిష పొలిటికల్ ఎంట్రీ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -