ICC: ఇండియా-పాక్ ఫైనల్ కోసం ఐసీసీ మ్యాచ్ ఫిక్స్ చేసిందా..? కివీస్ ఓటమికీ అదే కారణమా..?

ICC: టీ20 ప్రపంచకప్ నిర్వహణలో లోపాలను సరిదిద్దుకోవడానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)  మ్యాచ్ ఫిక్సింగ్‌లకు పాల్పడుతోందా..? అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు. సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ఇదే అంశం మీద చర్చ నడుస్తున్నది.  నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓటమి.. ఆసీస్ సెమీస్ చేరకపోవడం.. సెమీస్ లో కివీస్ ఓడటం ఇవన్నీ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలకు ఊతమిస్తున్నాయి.  తాజాగా న్యూజిలాండ్ – పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఇందుకు ఉదాహరణగా మారింది.

 

 

 

ఈ టోర్నీ ప్రారంభంలో ఇండియా-పాకిస్తాన్ మధ్య మెల్‌బోర్న్ వేదికగా గతనెల 23న  మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు  మెల్‌బోర్న్ స్టేడియం నిండింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్  గెలిచింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత ఇంత  క్రౌడ్ మరే మ్యాచ్‌లోనూ కనిపించలేదు.  జింబాబ్వే – పాకిస్తాన్ ను ఓడించడం,  ఐర్లాండ్.. ఇంగ్లాండ్ పై గెలవడం వంటి ఉత్కంఠ మ్యాచ్ లు జరిగిన రెవెన్యూ పరంగా చూసినా, క్రేజ్ పరంగా లెక్కలేసినా ఇండియా-పాక్ మ్యాచ్ కు వచ్చిన  ఆదరణ మరే మ్యాచ్ కూ రాలేదనేది కండ్ల ముందు కనబడుతున్న వాస్తవం.

 

దీనికి తోడు వర్షం కూడా పలు కీలక మ్యాచ్ ల మీద నీళ్లు చల్లింది.  ఇంగ్లాండ్ – ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా – జింబాబ్వే, అఫ్గాన్-కివీస్ మ్యాచ్ లు వర్షం వల్లే రద్దయ్యాయి. దీంతో ఐసీసీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వానాకాలంలో ఆస్ట్రేలియాలో టోర్నీ నిర్వహించడం తెలివితక్కువ చర్య అని  టోర్నీ నిర్వాహకుల మీద క్రికెట్ అభిమానులు దుమ్మెత్తిపోశారు.   దీంతో  ఐసీసీ అప్పట్నుంచే  పక్కా పథకం ప్రకారం  ఈ టోర్నీని నిర్వహిస్తున్నదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

భారత్ వంటి పటిష్ట జట్టును చిత్తుగా ఓడించిన దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ చేతిలో ఓడటం, బంగ్లాదేశ్ – ఇండియాతో మ్యాచ్ లో వాన వల్ల మ్యాచ్ సాగే అవకాశాలు లేకున్నా దానిని నిర్వహించడం వంటివాటితో పాటు సెమీస్ లో  కివీస్ ను పాక్ ఓడించడం కూడా  ఇందులో భాగమేనన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

మరోసారి ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఐసీసీ భారీ ఆశలు   పెట్టుకున్నదని.. ఫైనల్ లో ఇండియా-పాక్ మ్యాచ్ తప్పదని కూడా వాదనలు చేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో గురువారం ఇంగ్లాండ్ తో జరుగబోయే మ్యాచ్ కూడా  ఐసీసీ పథకం ప్రకారమే జరుగడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. మరి  ఐసీసీ నిజంగా మ్యాచ్ లు ఫిక్స్ చేస్తున్నదా..?   లేక  సజావుగా సాగుతుందా..? అనేది ప్రస్తుతానికైతే సస్పెన్సే…!

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -