IND vs BAN: భార‌త్‌పై బంగ్లా గెలిస్తే డేట్‌కి రెడీ అన్న‌ పాకిస్తాన్ నటి.. అసలేం జరిగిందంటే?

IND vs BAN: 2023 ప్రపంచ కప్ లో భారత్ కి తొలి ఓటమి కలగాలని ఒక పాకిస్తానీ నటి కలలు కంటుంది. భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలవాలని తాను కోరుకున్నట్లు తెలిపింది. సెహర్ షిన్వారి పాకిస్తాన్ కి చెందిన మహిళ. ఈమె ప్లాట్ఫారం ఎక్స్ ట్విట్టర్లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ లో బంగ్లాదేశ్ గెలిస్తే తాను బెంగాలీ అబ్బాయితో డేటింగ్ కి వెళ్తానని వాగ్దానం చేసింది. మనదేశంలో జరుగుతున్న 2023 ప్రపంచ కప్ లో భారత్ తో తలపడిన పాకిస్తాన్ అహ్మదాబాద్ లో ఘోర పరాజయం పాలయింది.
ఇక పాకిస్తాన్ వాళ్ళ ఏడుపులు మామూలే ఇప్పుడు ఏదో ఒక విధంగా మన మీద అక్కసు వెళ్ళగక్కుతూనే ఉంటారు. విఐపి లందరూ తమ కోపాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే ఏమి కూడా తన కోపాన్ని ఈ విధంగా ప్రదర్శించింది ఆమె ట్విట్టర్లో ఇలా రాసుకొని వచ్చింది, ఇన్షా అల్లా నా బంగాలి బంధు తర్వాత మ్యాచ్లో భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటాడు.
వారి జట్టు భారత్ ను ఓడించగలిగితే నేను ఢాకా వెళ్లి బంగాలి అబ్బాయితో చేపల డిన్నర్ డేట్ చేసి వస్తాను అని తెలిపింది. ఈ రకంగా ఇండియా పై అక్కసు వెళ్లగక్కిన ఈ బ్యూటీ బంగ్లాదేశ్ కి కిక్కు పెంచే ప్రయత్నం కూడా చేసింది. విరాట్ కోహ్లీ వికెట్ విలువపై బంగ్లాదేశ్ క్రికెటర్ షాకీబ్ అల్ హసన్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
మెన్ ఇన్ బ్లూ జరిగిన పోరు కి ముందు అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీని ఐదుసార్లు అవుట్ చేశానని, మరోసారి అలా చేయాలని షకీబ్ కోరుకున్నారు. అతను ఒక ప్రత్యేకమైన బ్యాట్స్మెన్. ఆధునిక యుగంలో అత్యుత్తమ బ్యాట్స్మెన్. అతని అన్నిసార్లు అవుట్ చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను అని స్టార్ స్పోర్ట్స్ తో అన్నారు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -