Jai NTR: జై ఎన్టీఆర్ అనడమే శాపమా.. జూ ఎన్టీఆర్ పై పగ ఎందుకంటూ?

Jai NTR: అమెరికా వెళ్లినా అంతరిక్షానికి వెళ్లినా టిడిపి క్యాడర్ లో ఆ బుద్ధి పోలేదు. నందమూరి అభిమానుల సపోర్ట్ కావాలి .. వారి ఇమేజి పార్టీకి కావాలి కానీ నందమూరి వారి ఉనికి మాత్రం పార్టీలో ఉండకూడదు. ఒక్కసారి ఎమ్మెల్యేగా కూడా గెలవని లోకేష్ మాత్రమే పార్టీకి సారధ్యం వహించాలి.. అయన నినాదాలే వినిపించాలి.. అయన పేరే కనిపించాలి.. వేరే వారి పేరు వినిపించిందా.. అయినట్టే.. . అటునుంచి దాడి మొదలైనట్టే.. బుడ్డోడు.. చిన్న ఎన్టీయార్ అంటే టిడిపి .. ముఖ్యంగా లోకేష్, చంద్రబాబుల అభిమానులు రగిలిపోతుంటారు.. టిడిపి సభల్లో.. సమావేశాల్లో ఎక్కడైనా నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీయార్ పేరు వినిపిస్తే శివాలెత్తిపోవడం చాలాసార్లు జరిగింది. ఆఖరుకు అదే దుగ్ధ.. జెలస్.. అసూయ ఇప్పుడు అమెరికా వెళ్లినా పోలేదు. ప్రస్తుతం అమెరికాలో ఫిలడెల్ఫీయాలో తానా సభలు జరుగుతున్నాయి. దీనికి పలువురు టిడిపి అభిమానులు ఆంధ్రానుంచి వెళ్లగా.. అమెరికాలో ఉండే టిడిపి కార్యకర్తలు.. చంద్రబాబు అభిమానులు సైతం హాజరయ్యారు. అయితే ఈ సందర్భముగా జూనియర్ ఎన్టీయార్ అభిమాని ఒకరు జై ఎన్టీయార్ అని నినదించడంతో లోకేష్.. చంద్రబాబుల అభిమానులు ఆయనమీద దాడిచేసి కొట్టారు. టిడిపి

ఎన్నారై అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలో అక్కడి యువత రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిమీద ఒకరు పిడి గుద్దులు గుద్దుకున్నారు. తరణి పరుచూరి, సతీష్ వేమన వర్గాలు ఈ గొడవలో వేర్వేరుగా తలపడి తన్నుకున్నారు.

జూనియర్ ప్రస్తావన ఇక్కడ ఎందుకు ?

 

ఈ సభ టిడిపికి అనుకూలంగా ప్రచారం చేసేందుకు.. పార్టీకి హైప్ తేవడానికి ఏర్పాటు చేసినందున ఇక్కడ జానియర్ ఎన్టీయార్ ప్రస్తావన ఎందుకు ? ఆయనకు తెలుగుదేశానికి ఏమి సంబంధం అంటూ లోకేష్ అభిమానులు ఆ కుర్రాడి మీదపడి కొట్టినట్లు తెలుస్తోంది. అసలు తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీయార్ ఆనవాళ్లు, ఉనికి అవసరం లేదని.. ఆయనకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని టిడిపి భావిస్తోంది. అందుకే వీలైనప్పుడల్లా జూనియర్ ను , అయన అభిమానులను సైతం అవమానించడానికి చంద్రబాబు సైతం ఆ ఏమాత్రం సంకోచించడం లేదు. ఆమధ్య గుడివాడలో చంద్రబాబు సభలో కొందరు అభిమానులు హరికృష్ణ, జూనియర్ ఎన్టీయార్ ఫోటోలు ప్రదర్శించి జోహార్ హరికృష్ణ అని నినదించినందుకు వారిమీద చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్టీయార్ శత జయంతి సభ విజయవాడలో నిర్వహించినా జూనియర్ కు పిలుపు రాలేదు. మొత్తానికి అయన ఉనికి అవసరం లేదనుకున్నారో.. ఉంటే ప్రమాదం అనుకున్నారో తెలియదు కానీ జూనియర్ అనే సౌండ్ వినిపిస్తే చాలు చంద్రబాబు .. లోకేష్ అభిమానులు రౌండప్ చేసి కొట్టేస్తున్నారు..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -