TDP: బీజేపీతో జత కట్టడం టీడీపీకి అంత నష్టమా..?

TDP: ఆంధ్రప్రదేశ్‌‌లో వైసీపీ, టీడీపీ మధ్య అగ్గి రగులుతూనే ఉంది. అధికార పార్టీ తప్పులను, వైఫల్యాలను ఎండగట్టడంలో టీడీపీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. మరోవైపు వ్యూహాత్మకంగా కూడా అడుగులు వేస్తుంది. అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వడానికి ఒంటరిగా వెళ్లడం కంటే పొత్తులు బెటరనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇటీవల రాష్ట్ర బీజేపీతో రహస్య మంతనాలు జరిపారన్న టాక్ వినబడుతుంది.

ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బాబు.. నరేంద్ర మోదీతో ఉప్పు నిప్పులా వ్యవహరించారు. కానీ ఇప్పుడు బీజేపీతో స్నేహానికి బాటలు వేసుకున్నట్టు కనిపిస్తుంది. అధికారంలోకి రావడానికి కమలదళంతో కలసి వెళ్లడమే బెటర్ అనే యోచనలో బాబు ఉన్నట్టు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు చంద్రబాబుకు లాభమా..? నష్టమా..? అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వైసీపీని ఫేస్ చేయడానికి కావల్సినంత బలం చేకూరినట్టే అవుతుందన్న వాదన వినిపిస్తుంది. కేంద్రంపై వైసీపీ నేతలెవరూ నోరు ఎత్తే సాహసాలు చేయరు కాబట్టి.. ఇది తమకూ ప్లస్ అవుతుందని టీడీపీ భావిస్తోంది. బీజేపీ నాయకుల అండతో వైసీపీ పాలనను మరింత ప్రశ్నించవచ్చని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం.

అదేవిధంగా బీజేపీతో కలిస్తే.. ఆటోమేటిక్‌గా జనసేన కూడా యాడ్ అవుతుంది. ఇక తమ కూటమితోనే వైసీపీకి పూర్తిగా చెక్ పెట్టొచ్చని చంద్రబాబునాయుడు స్కెచ్‌లు వేస్తున్నారట. దీంతోనే బీజేపీ చేయి అందిస్తే అందుకోవడానికే చంద్రబాబు మొగ్గు చూపిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి.

అయితే మరికొందరు మాత్రం ఏపీలో బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, ఆ పార్టీతో పొత్తు వల్ల టీడీపికి ఒరిగేదేమి లేదని అంటున్నారు. పైగా అనవసరం ఇబ్బందులు కొని తెచ్చుకోవడమే అవుతుందని అంటున్నారు. సీట్లు కూడా త్యాగం చేయాల్సి ఉంటుందని, తెలుగు దేశానికి ఎక్కువ నష్టమే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ జనసేనను కలుపుకుంటే మాత్రం కొంత కలసి వచ్చే ఛాన్స్ ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. పవన్ కల్యాణ్ మేనియా తెలుగు దేశానికి పనికి వచ్చే అవకాశాలు ఉన్నాయంట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబునాయుడు బీజేపీకి దూరంగా ఉండడమే బెటర్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో ఓటు బ్యాంకు కూడా లేదని, కమలం వెంటడడం వల్లే పెద్ద ప్రయోజనం ఏమి లేదని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. టీడీపీలో కూడా చాలామంది ఇదే అభిప్రాయంతో ఉన్నారట.

పైగా బీజేపీతో దోస్తీ కట్టడం వల్ల ఆ పార్టీకి మరింత బలాన్ని ఇచ్చినట్టవుతుందని కొందరు భావిస్తున్నారు.
ఒకే దేశం.. ఒకే పార్టీ అనే నినాదంతో ఉన్న బీజేపీకి.. ప్రాంతీయ పార్టీల పట్ల ఎంత చిత్తశుద్ది ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని రాజకీయ నిపుణులు అంటున్నారు. రాష్ట్రంలో మూడు పార్టీలను తమ పంచన పెట్టుకోవడం బీజేపీ గేమ్ ప్లాన్ కూడా కావొచ్చని అంటున్నారు. ప్రత్యేకహోదా గురించి ఇన్ని రోజులు ఫైట్ చేసిన చంద్రబాబు.. ఇప్పటి వరకూ దాని ఊసే ఎత్తని బీజేపీతో పొత్తు అంటే జనాలు అస్సలు యాక్సెప్ట్ చేస్తారా..? అన్న ప్రశ్న వినిపిస్తోంది. కాబట్టి ప్రస్తుతానికి చంద్రబాబునాయుడు తన సైకిల్‌పై బీజేపీని ఎక్కించుకోవడానికి మక్కువ చూపకపోవడమే మంచిదని చాలామంది అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -