Unstoppable: ఆ రీజన్ వల్లే అన్‌స్టాపబుల్‌కు హీరోయిన్లు రావట్లేదా?

Unstoppable: నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో దేశంలోని టెలివిజన్ రంగంలో ఓ సంచలనమనే చెప్పాలి. వ్యూస్ పరంగా చూసుకుంటే.. ఇండియాలోని టాక్ షోల్లో హయ్యెస్ట్ వీక్షణలు ఈ షోకే సొంతం అని చెప్పాలి. సాక్షాత్తూ ఐఎండీబీనే ఈ విషయాన్ని వెల్లడించింది.

 

ప్రస్తుతం ‘అన్‌స్టాపబుల్’ సీజన్ 2 సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతోంది. బాలయ్య బాబు తనదైన శైలిలో అల్లరి చేస్తూ షోను పాపులర్ చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్​ కూడా ఈ షోలో బాలయ్యతో కలసి పాల్గొని ముచ్చటించారు. త్వరలో మరికొందరు బిగ్ స్టార్స్ ‘అన్‌స్టాపబుల్’కు విచ్చేస్తారని వినికిడి.

 

అవమానిస్తారేమోనని జంకుతున్న హీరోయిన్లు!
హీరోలు ఎందరో ‘అన్‌స్టాపబుల్’ షోకు వస్తున్నా.. హీరోయిన్లు మాత్రం ఈ షోకు దూరంగానే ఉంటున్నారు. కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ తో బాలయ్య చిక్కుల్లో పెడతారనే భయంతోనే వాళ్లు ఈ షోకు రావడం లేదని టాక్. బాలకృష్ణ అడిగే ఇబ్బందికరమైన ప్రశ్నలు, బూతు డైలాగులకు హీరోయిన్లు భయపడి.. అనవసరంగా అందరి ముందు ఎందుకు అవమానపడాలనే ఉద్దేశంతో దూరంగా ఉంటున్నారని పరిశ్రమలో జనాలు అనుకుంటున్నారు.

 

‘అన్‌స్టాపబుల్’ షో రాన్రాను బూతు పురాణంగా తయారైందనే చర్చలు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఓటీటీ కాబట్టి ఎలాంటి నియంత్రణ లేదనే ఎటువంటి ప్రశ్నలైనా అడగొచ్చనే స్వేచ్ఛతో బాలయ్య వ్యవహరిస్తున్నారని.. కాబట్టే వల్గారిటీ డోస్ బాగా పెంచేస్తున్నారని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ షోలో బూతు డోస్ ఎప్పుడు తగ్గుతుందో, హీరోయిన్లు ఎప్పుడు వస్తారో, జనాలను క్లీన్ ఎంటర్ టైన్మెంట్ ను ఎప్పుడు అందిస్తారో అనే ప్రశ్నలకు ‘ఆహా’ యాజమాన్యం, బాలయ్యకే సమాధానాలు తెలియాలి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -