TDP: టీడీపీ ఆ పనులు చెప్పుకోకపోవడం వల్లే నష్టం కలుగుతోందా?

TDP: తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన యువగలం పాదయాత్రలో భాగంగా 55వ రోజు గురువారం శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో గుట్టూరు గ్రామంలో 700 కిమీ మైలురాయిని అధిగమించారు. ఈ సందర్భంగా ఆయన పాదయాత్ర చేస్తూనే మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు ఈయన సమాధానం ఇచ్చారు. ఇక ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ… సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది ప్రజలు తనని నేరుగా కలుసుకొని వారి సమస్యలను నాకు తెలియజేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం తనకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని తెలిపారు. వచ్చే ఎన్నికలలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను పరిష్కరించడానికి అనుగుణంగా ఉంటుందని తెలిపారు.

 

ఇక సెల్ఫీ చాలెంజ్ విషయం గురించి కూడా మాట్లాడుతూ..ఇదివరకు మేము అధికారంలో ఉండి ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేసినటువంటి మంచి పనులను ఎక్కడ చెప్పుకోలేదు ఇలా మేము చేసిన పనులను చెప్పుకోకపోవడమే మా పార్టీకి చాలా మైనస్ గా మారిందని తెలియజేశారు. అందుకే ఈ పాదయాత్రలో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేసింది.. ఎలాంటి కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చిందనే విషయాలను ఈ సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నామని తెలిపారు.

 

ఇలా మేము సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా మా ప్రభుత్వం హయామంలో చేసిన అభివృద్ధి పనులను చూపిస్తూ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగు సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి పనులు చేసిందని ప్రజల తరఫున నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అయితే ఇప్పటికీ నా ప్రశ్నకు వైసిపి ప్రభుత్వం నుంచి ఒకసారి కూడా సమాధానం రాలేదు అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అంటూ ఈ సందర్భంగా లోకేష్ వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -