Mangalagiri: మంగళగిరిలో వైసీపీ ఓడిపోవడం ఖాయమా.. జరగబోయేది ఇదేనా?

Mangalagiri: గత శాసనసభ ఎన్నికలలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ ఎన్నికల బరిలో దిగారు. ఈ క్రమంలోనే ఈయన గెలుస్తారన్న ధీమా వ్యక్తం చేయగా టిడిపి వైఎస్ఆర్సిపి అభ్యర్థి రామకృష్ణారెడ్డి చేతిలో నారా లోకేష్ ఘోరంగా ఓడిపోయారు. ఇలా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా ఈయనకు మంత్రి పదవి వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈయనకు మంత్రి పదవి రాకపోగా వచ్చే ఎన్నికలలో ఈయనకు కనీసం టికెట్ కూడా దక్కడం లేదని తెలుస్తోంది.

ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఐ ప్యాక్ సర్వే చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో భాగంగా పనితీరు లేనటువంటి ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వబోనని జగన్ ఖరాఖండిగా చెప్పారు.ఇలా పనితీరు మెరుగ్గా లేకుండా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలలో రామకృష్ణారెడ్డి కూడా ఒకరిని చెప్పాలి. అందుకే ఈయనకు టికెట్ ఇవ్వరని ఈయన స్థానంలో గంజి చిరంజీవికి మంగళగిరి బాధ్యతలను అప్పచెప్పారు.

 

ఇక ఈయన పనితీరు పట్ల కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి అధిష్టానం కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ బుట్టా రేణుకను రంగంలోకి దింపడానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలోనే వేరే జిల్లా నుంచి తమ నియోజకవర్గంలో ఎన్నికల పోటీకి వస్తున్నారు అంటే సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సొంత పార్టీ నేతలను ఒప్పించే పనిని అధిష్టానం జిల్లా సమన్వయకర్త మర్రి రాజశేఖర్‌కు అప్పగించిన్నట్లు తెలుస్తోంది. తెర వెనుక ఈ పనులన్నీ పూర్తి అయితే బుట్టా రేణుకను అధికారకంగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.

 

ఇలా గత ఎన్నికలలో నారా లోకేష్ పై అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వకపోవడం అంటేనే వైఎస్ఆర్సిపి పార్టీ మంగళగిరిలో ఓడిపోయిందని అర్థం చేసుకోవచ్చు ఓటమి భయంతోనే ఇలా పార్టీ అభ్యర్థులు మారుతున్నారని తెలుస్తోంది. అయితే ఈసారి ఎలాగైనా మంగళగిరిలో గెలిచి తానేంటో నిరూపిస్తానని లోకేష్ కూడా శపదాలు చేసిన విషయం మనకు తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -