Komatireddy Venkatareddy: కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై వేటు ఖాయమేనా? సీతక్క వ్యాఖ్యలతో బయటపడ్డ అసలు విషయం

Komatireddy Venkatareddy:  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో కాక రేపుతోంది. తన లోక్ సభ పరిధిలో జరుగుతున్న మునుగోడు ఉపఎన్నికలో ఆయన ప్రచారం చేయకపోగా.. బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తోన్న తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరపున ఆయన ఫోన్ లో ప్రచారం చేయడంపై కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. సొంత పార్టీని కాదని బీజేపీకి ప్రచారం చేయడం ఏంటి అని హస్తం నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ లో ఉండి తన తమ్ముడికి ప్రచారం చేయడం ఏంటి అని కాంగ్రెస్ నతేలు మండిపడుతున్నారు. రాజగోపాల్ రెడ్డికి ఓటేయాల్సిందిగా మునుగోడు కాంగ్రెస్ నేతలతో ఆయన మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో లీక్ అయిన విషయం తెలిసిందే.

ఈ ఆడియో కాంగ్రెస్ వర్గాల్లో కల్లోలం సృష్టిస్తోంది. దీంతో పాటు మునుగోడులో ప్రచారం చేయకుండా కుటుంభసభ్యులతో కలిసి వెంకటరెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకకు వెళ్లడంపై కాంగ్రెస్ నేతలు సీరియస్ అవుతున్నారు. నేతలు, కార్యకర్తలు మునుగోడులో పార్టీని గెలిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటే.. ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబసబ్యులతో కలిసి ఆస్ట్రేలియాలో జల్సాలు చేయడం ఏంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. ఆస్ట్రేలియా ఎయిర్ పోర్ట్ లో తనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన అభిమానులతో మునుగోడు ఉపఎన్నిక గురించి ఆయన మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. మునుగోడులో తాను ప్రచారం చేసినా కాంగ్రెస్ కు ఒక 10 ఓట్లు వస్తాయోమో కానీ కాంగ్రెస్ పార్టీ గెలవదంటూ ఆయన వ్యాఖ్యానించారు.

మునుగోడులో కాంగ్రెస్ గెలవదంటూ వెంకటరెడ్డి వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ పెద్దలు అసహనం వ్యక్తం చేస్తోన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా వెంకటరెడ్డి ప్రచారం చేయడంపై హస్తం నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో వెంకటరెడ్డి ఆడియో, వీడియోలను టీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ అధిష్టానికి పంపి చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో వెంకటరెడ్డికి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పది రోజుల్లో సమాధానం ఇవ్వాలని వెంకటరెడ్డిని ఆదేశించరాు. దీంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాముందని ప్రచారం జరుగుతోంది.

అయితే వెంకటరెడ్డిపై మీడియా వేదికగా కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆడియో, వీడియోపై ఆయన స్పందించారు. వెంకటరెడ్డి ఓ దుర్మార్గుడని, ఆయన కోవర్టు ఆపరేషన్ పనికిమాలిన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలు ఉంటూ వేరే పార్టీలోకి ఓటేయాలని కోరడం ఏంటంటూ ఫైర్ అయ్యారు. వెంకటరెడ్డి లాంటి వ్యక్తులను పార్టీ పక్కన పెట్టాలని సూచించారు. షోకాజ్ నోటీసులపై వెంకటరెడ్డి స్పందించి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇక మునుగోడులో ప్రచారం చేయకుండా విదేశీ పర్యటనకు వెళ్లడం ఏంటని సీతక్క మండిపడ్డారు. తన తమ్ముడు తరపున ప్రచారం చేయాలనుకుంటే కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరాలని ఆమె సచించారు. బంధాలకతీతంగా రాజకీయాలు చేయాలని సీతక్క సూచించారు. సీతక్క వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ లో మంట రేపుతోన్నాయి. మీడియా ముందే వెంకటరెడ్డిపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో.. వెంకటరెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఖయమని చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో ముఖ్య నేతగా ఆమె ఉన్నారు. జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ లో కీలక పదవులు నిర్వర్తిస్తున్నారు. దీంతో సీతక్క వెనుక కాంగ్రెస్ అధిష్టానం ఉందనే ప్రచారం జరుగుతోది.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -