Pawan Kalyan: పవన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకోవడం కష్టమా?

Pawan Kalyan: టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కాగా జనసేన పార్టీ ఆవిర్భవించి సక్సెస్ ఫుల్ గా తొమ్మిది ఏళ్లు పూర్తి చేసుకుని పదవ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న సందర్భంగా మచిలీపట్నంలో భారీ సభను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మచిలీపట్నంలో జనసేన పదో ఆవిర్భావ సభ అర్ధరాత్రి వరకు సాగింది. అటు పవన్ కళ్యాణ్ ఇటు అభిమానులు ఆకలి దప్పికలను లెక్కచేయలేదు. అభిమాన నాయకుడి ప్ర‌సంగం వినేందుకు, స‌భ‌ను విజ‌య‌వంతం చేసేందుకు గంట‌ల త‌ర‌బ‌డి నిరీక్షించారు అభిమానులు. కాగా మ‌చిలీప‌ట్నంలో జ‌న‌సేన షెడ్యూల్ ప్ర‌కారం సాయంత్రం ఐదు గంట‌ల‌కు స‌భ ప్రారంభం కావాల్సి వుంది.

వారాహి వాహ‌నంపై ప‌వ‌న్ మంగ‌ళ‌గిరి నుంచి మ‌చిలీప‌ట్నం స‌భా వేదిక వ‌ద్ద‌కు బ‌య‌ల్దేరారు. అక్క‌డికి రావ‌డానికి ఐదు గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. అంత వ‌ర‌కూ స‌భా వేదిక‌పై సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు, నాయ‌కుల ప్ర‌సంగాలు కొన‌సాగాయి. అన్నీ పూర్త‌యి ప‌వ‌న్ ప్ర‌సంగం స‌రిగ్గా రాత్రి ప‌ది గంట‌ల‌కు ప్రారంభ‌మైంది. గంట‌న్న‌ర పాటు ఆయ‌న ప్ర‌సంగం కొన‌సాగింది. అంటే రాత్రి 11.30 గంట‌ల‌కు ప‌వ‌న్ ప్రసంగం పూర్త‌యింది. ప‌వ‌న్ ప్ర‌సంగం పూర్త‌య్యే వ‌ర‌కూ అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు స‌భా ప్రాంగ‌ణంలోనే ఉండ‌డం గొప్ప సంగ‌తి అని చెప్పవచ్చు. కానీ ఇతర సభల్లో అయితే కాస్త చీకటి అయింది కాస్త లేట్ అయింది అంటే చాలు పార్టీ సభలో ఉండే వారి కంటే వెళ్ళిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

 

కానీ అర్ధ‌రాత్రి అవుతున్నా జ‌నస‌భ ఆవిర్భావ స‌భ‌లో అలాంటి సీన్ క‌నిపించ‌లేదు. ఇలాంటి ప్రాణం ఇచ్చే అభిమానుల్ని పెట్టుకుని, ప‌వ‌న్ టీడీపీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేయ‌డ‌మే విచార‌క‌రం. జ‌న‌సేన ఎద‌గ‌క‌పోవ‌డానికి ప‌వ‌న్ స్వీయ త‌ప్పిదాలే కార‌ణం. అంతే త‌ప్ప‌, జ‌న సైనికులు, అభిమానుల‌ది ఎంత మాత్రం కాదు. అయితే ఈ విషయంలో జగన్ తో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ గ్రేట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా సందర్భాలలో జగన్ ఏర్పాటు చేసిన సభలలో చాలావరకు ప్రసంగాన్ని వినకుండా మధ్యలో నుంచి వెళ్లిపోయిన వారే ఎంతో మంది ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -