Uttar Pradesh: రాత్రి కూతురు చంపి ఉదయాన్నే ఏమీ తెలియనట్టు అలా?

Uttar Pradesh: ప్రేమ.. ఈ రెండు అక్షరాల పదం ఎప్పుడు ఎవరి మధ్య ఎలా కలుగుతుందో చెప్పడం చాలా కష్టం. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఈ ప్రేమ అన్న ఊబిలో కూలిపోయి యువత తప్పు దోవపడుతున్నారు. మరి కొందరు అయితే తల్లిదండ్రులకు తీరని శోఖాన్ని మిగులుస్తున్నారు. ఇంకొందరు తల్లిదండ్రులు పిల్లలు చేస్తే తప్పు అని చెప్పాల్సింది పోయి వారిని చంపడానికైనా వెనకాడడం లేదు. ఒక తండ్రి అలాంటి పనే చేశాడు. అసలేం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్, చాందినగర్ పరిధిలోని పంచి అనే గ్రామానికి చెందిన ప్రమోద్ అనే వ్యక్తి హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు.

ఇతనికి అరుగురు సంతానం. నలుగురు కుమార్తెలు కాగా, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరందరిలో పెద్ద కుమార్తె అయిన జియా 16 ఏళ్ల యువతి స్థానికంగా ఉన్న పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కాగా జియా స్థానికంగా ఉండే ఒక వ్యక్తితో తరచుగా ఫోన్ మాట్లాడుతూ ఉండేది. అలా ఇటీవల ఎప్పటిలాగా ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఆ యువకుడుతో ఫోన్లో మాట్లాడుతూ ప్రమోద్ కంట పడింది. అప్పుడు తండ్రి ప్రమోద్ బాలికను గట్టిగా మందలించి ఇంకొకసారి అలా చేయకని వార్నింగ్ ఇచ్చాడు. అయినప్పటికీ జియా ప్రవర్తనలో మార్పు రాకపోగా అలాగే ప్రవర్తిస్తూ వచ్చింది. ఎవరికి కనిపించకుండా పక్కకు వెళ్లి మరి ఫోన్ మాట్లాడుతూ ఉండేది.

 

అయితే జియో ఫోన్ మాట్లాడుతున్న విషయాన్ని గమనించిన ఆమె తండ్రి ఎలా అయినా అ కూతుర్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోని ఇటీవలే ఫిబ్రవరి 23వ తేదీన మరొకసారి జియా యువకుడితో ఫోన్లో మాట్లాడుతుండగా అది చూసి కోపంతో రగిలిపోయిన ప్రమోద్ కూతురిపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం బాలిక మృతదేహాన్ని సోదరుడు మోహిత్‌తో కలిసి సమీప గ్రామంలో ఉన్న హిందర్ నదిలో పడేశాడు. అనంతరం ఏమీ ఎరుగనట్లు ఉదయాన్నే విధులకు వెళ్లిపోయాడు. తర్వాత జియా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతకడం మొదలుపెట్టారు. ప్రమోద్ కూడా తనకు ఏమీ తెలియదు అన్నట్టుగా కుటుంబ సభ్యులతో కలిసి వెతకడం మొదలుపెట్టాడు. అయితే, మార్చి 1న గుర్తు తెలియని శవం నదిలో తేలాడుతున్నట్లు ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాలిక కుటుంబసభ్యులను విచారించగా తండ్రి తానే హత్య చేసినట్లుగా నేరం అంగీకరించాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -