Chandra Babu: బాబుకు భారతి క్షమాపణలు చెప్పడం సాధ్యమేనా?

Chandra Babu: ప్రస్తుతం ఏపీలో మాజీ మంత్రి వివేకా హత్య కేసు సంచలనంగా మారింది. ఈ ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పేరు వినిపించిన తర్వాత ఏపీ రాజకీయాలు మరింత చలనంగా మారాయి. ఇది ఇలా ఉంటే వివేకా హత్య కేసులో చంద్రబాబు పాత్ర పై తాజాగా సాక్షి పత్రిక తప్పుడు కథనం రాసిందని, కాబట్టి ఆ సంస్థ చైర్ పర్సన్ అయిన వైయస్ భారతి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కి క్షమాపణలు చెప్పాలి అని టిడిపి నేతలు సరికొత్త డిమాండ్ ని తెరపైకి తీసుకువచ్చారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌, ఆయ‌న భార్య భార‌తికి చంద్ర‌బాబు, ఆయ‌న కోసం ప‌ని చేస్తున్న ఎల్లో మీడియా ప్ర‌తిరోజూ క్ష‌మాప‌ణ చెప్పాల్సి వుంటుందది అనే కామెంట్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి.

వివేకా హ‌త్య‌కు సంబంధించి నాడు సాక్షిలో నారాసుర రక్తచరిత్ర శీర్షిక‌తో బ్యాన‌ర్ క‌థ‌నాన్ని టీడీపీ నేత‌లు ఇప్పుడు తెర‌పైకి తెచ్చారు. ఈ కేసులో వైఎస్ భాస్క‌ర్‌ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయ‌డంతో పాటు ఆయ‌న కుమారుడైన క‌డ‌ప ఎంపీ అవినాష్‌ రెడ్డిని కూడా అవ‌స‌ర‌మైతే అరెస్ట్ చేస్తామ‌ని విచార‌ణ సంస్థ తెలంగాణ హైకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో వివేకా హ‌త్య కేసులో నిందితులు వైఎస్ కుటుంబానికి చెందిన వారే అంటూ టీడీపీ నేత‌లు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా వివేకా హత్య కేసును చంద్రబాబుకు అంటగట్టాలని చూసారని పాత విషయాలను మళ్లీమళ్లీ తిరగతోడుతున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.

 

నారాసుర ర‌క్త చ‌రిత్ర అంటూ వైఎస్ జ‌గ‌న్ త‌న సాక్షి ప‌త్రిక‌లో విష ప్ర‌చారం చేశార‌ని టీడీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. అయితే సీబీఐ విచార‌ణ‌లో నిందితుల జాబితాలో జ‌గ‌న్ కుటుంబ స‌భ్యులే ఉన్నార‌ని చెప్పుకొస్తున్నారు. నాడు నారాసుర రక్తచరిత్ర అని రాసిన సాక్షి పత్రిక డైరెక్టర్ భారతీరెడ్డి చంద్రబాబుకు, టీడీపీకి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆ పార్టీ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నేతలు ప్రతిరోజు టిడిపి నాయకులు పత్రికల్లో జగన్ తో పాటు ఇతర వైసిపి నేతలపై విషం చిమ్మడాన్ని మరోసారి గుర్తు చేస్తున్నారు. టీడీపీ డిమాండ్‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే ప్ర‌తిరోజూ చంద్ర‌బాబు, ఎల్లో మీడియా జ‌గ‌న్‌కు, వైసీపీకి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సి వుంటుంద‌ని హిత‌వు పలుకుతున్నారు. విషం చిమ్మ‌డ‌మే ఎజెండాగా ఎల్లో ప‌త్రిక‌లు, టీడీపీ నేత‌లు ప‌ని చేస్తున్నాయ‌నేందుకు రోజూ ఎన్ని ఉదాహ‌ర‌ణలైనా చూపుతామంటున్నారు అధికార నేతలు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -