Nandamuri: నందమూరి వంశం పరువు నిలబెట్టడం మోక్షజ్ఞకు సాధ్యమా?

Nandamuri: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేకత, క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లాంటి హీరోలు ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఎవరికి వారు ప్రత్యేకంగా ఫ్యాన్స్ బేస్ ని ఏర్పరుచుకున్నారు. ఇది ఇలా ఉంటే నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

కానీ ఇప్పటివరకు మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది లేదు. కనీసం పలానా సినిమాలో నటిస్తున్నాడు అన్న వార్తలు కూడా వినిపించడం లేదు. ఎంట్రీ ఇస్తున్నాడు అని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ సంగతి పక్కన పెడితే మోక్షజ్ఞ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తే బాలయ్య,తారక్ లను మించి మోక్షజ్ఞ ఎదగడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మోక్షజ్ఞ యాక్టింగ్ టాలెంట్ గురించి ఎవరికీ కూడా సరైన అవగాహన లేదు. ఇంతకముందు కాస్త లావుగా బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ ఈ మధ్య బరువు తగ్గి లుక్ ను మార్చుకొని కొత్త లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

 

వచ్చే ఏడాది సెకండాఫ్ లో మోక్షజ్ఞ తొలి సినిమా రిలీజ్ కానుందని క్లారిటీ సైతం వచ్చేసింది. కాగా మోక్షజ్ఞ తొలి సినిమా ఆదిత్య369 తరహాలోనే ఉండనుందని ఈ మూవీ కాన్సెప్ట్ కొత్తగా ఉండనుందని సమాచారం. ఈ సినిమాకు దర్శకుడు ఎవరనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. ఆదిత్య999 మ్యాక్స్ సినిమా భారీ రేంజ్ లో ఉండనుందని సమాచారం. అయితే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వకముందే నందమూరి అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు. ఇంకా చెప్పాలి అంటే మోక్షజ్ఞ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం కానీ సినిమాలలో నటిస్తున్న విషయం కానీ ఎవరికీ తెలియదు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -