CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సీఎం కావడం సాధ్యమేనా.. ఆ బ్యూటీ మాట నిజమవుతుందా?

CM Pawan Kalyan: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో ఫుల్ యాక్టివ్ గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో ఫుల్ యాక్టివ్గా పాల్గొంటున్నారు. వారాహి యాత్రలో భాగంగా ఏపీలోని పలు జిల్లాలను సందర్శిస్తూ ప్రజల బాగోగులను అడిగి తెలుసుకుంటున్నారు.. అలాగే తనకు సీఎం అయ్యే అవకాశాన్ని ఒక్కసారి ఇవ్వాలని ఒకసారి తనను గెలిపించమని ప్రజలను వేడుకుంటున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో జనసేన నేతలు, పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో అలాగే పవన్ కళ్యాణ్ నిర్వహించే సభలలో ఎక్కడ చూసినా కూడా పవన్ సీఎం పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం అంటూ నినాదాలు చేస్తున్న విషయం తెలిసిందే.సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పవన్ సీఎం అంటూ ట్రీట్ లు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా బాలీవుడ్ బ్యూటీ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా సంతోషాన్ని కలిగించింది. పవన్ కళ్యాణ్‌ను ఏకంగా ఆంధ్రప్ర‌దేశ్ సీఎం అంటూ ట్వీట్ చేసింది. దీంతో జ‌న‌సైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 15 ఏళ్లు రాజ‌కీయాల్లో ఉండి. సొంత పార్టీ పెట్టి 10 సంవ‌త్స‌రాలు అయి రెండు చోట్ల పోటీ చేసిన‌ ఎమ్మెల్యే కూడా కాలేక‌పోయిన ప‌వ‌న్‌ను ట్వీట్ట‌ర్‌లో సీఎం చేయ‌డంతో ప్ర‌త్య‌ర్థులు ట్రోల్ చేస్తున్నారు.

 

నేడు పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా విడుదలైన విషయం తెలిసిందే. బ్రో సినిమాలో స్పెషల్ సాంగ్ లో చిందులు వేసిన బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ట్వీట్ట‌ర్ వేదిక‌గా.. ఏపీ గౌరవ సీఎం పవన్ కళ్యాణ్‌తో నటించడం చాలా సంతోషంగా ఉందని, సినిమా విడుద‌ల‌కు త‌న శుభాకాంక్ష‌లు చెప్పుతూ ట్వీట్ చేసింది. దీంతో ఈమెకు క‌నీస జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ లేదా? ఏపీ సీఎం జ‌గ‌న్ అని తెలియ‌దా? తెలిసిన న‌టిస్తున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు వైసీపీ నేతలు.మొత్తానికి ఇన్ని రోజులు తన అభిమానుల చేత సీఎం సీఎం అంటూ అనిపించుకున్న పవన్ కళ్యాణ్ తాజాగా ఓ హీరోయిన్ తో ఆంధ్రప్రదేశ్ సీఎం పవన్ కళ్యాణ్ అని అనిపించుకోవడం విశేషం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -