Pawan – Renu Desai: రేణు దేశాయ్ కామెంట్ల గురించి పవన్ స్పందించడం సాధ్యమేనా?

Pawan – Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య నటి రేణు దేశాయ్ గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ అభిమానులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్న విషయం మనకు తెలిసిందే. రెండు రోజుల నుంచి పవన్ ఫ్యాన్స్ వర్సెస్ రేణు దేశాయ్ అనే విధంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్ జరుగుతుంది.పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ల కుమారుడు ఆకీర నందన్ పుట్టినరోజు సందర్భంగా ఓ పవన్ ఫ్యాన్ చేసినటువంటి కామెంట్స్ తీవ్రదుమారాన్ని రేపుతుంది.

మా అన్న కొడుకును చూపించండి అంటూ నేటిజన్ కామెంట్ చేయడంతో మీ అన్న కొడుకు ఏంటి ఆకీరా నా కుమారుడు అంటూ రేణు దేశాయ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలా ఈ విషయం గురించి రెండు రోజులుగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు రేణు దేశాయ్ మధ్య వార్ జరుగుతుంది. అయితే తాజాగా ఒక నేటిజన్ రేణు దేశాయ్ కి చేసినటువంటి పోస్టును ఈమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.

మీరు పవన్ కళ్యాణ్ తో విడిపోయి చాలా రోజులవుతుంది అయినప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికీ మీ గురించి చెత్త వాగుడు వాగుతూనే ఉన్నారు. అయినా మీరు ఇంత స్ట్రాంగ్
ముందుకు వెళుతున్నా మళ్లీ మళ్లీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే చూస్తున్నారు. అయినా నాకు ఒకటి అర్థం కాదు..పవన్‌ అభిమానులుగా చెప్పుకునే ఈ పిచ్చి ఫ్యాన్స్‌ మిమ్మల్ని ఇంత బాధపెడుతుంటే వాళ్ల నోర్లు మూయించడానికి పీకే ఒక్క స్టేట్‌మెంట్‌ అయినా ఎందుకు ఇవ్వరు?.. రాష్ట్ర ప్రజలందరి బాధలు పట్టించుకుంటా, ఆడవాళ్లంటే గౌరవం అని చెప్పుకొని తిరిగే పవన్‌ తన మాజీ భార్య విషయంలో ఇలా ఎలా ఉండగలుగుతున్నాడు.

ఒకప్పుడు తాను ప్రేమించిన అమ్మాయి ఇలా మానసిక వేదనకు గురి అవుతున్న పట్టించుకోని పవన్ కళ్యాణ్ ఇక రాష్ట్ర ప్రజలను ఎలా చూసుకుంటారు అని ప్రశ్నించారు. మీ గురించి ఇలాంటి పిచ్చి వాగుడు వాగుతున్న ఫాన్స్ నోరు మూయించడానికి ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి వాళ్లను ఆపడానికి ఈయనకు ఏం అడ్డొస్తుందో అంటూ ప్రశ్నిస్తూ కామెంట్ చేశారు అయితే దీనిని రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ..చాలామంది మీలాగే ఈ విషయాల గురించి నన్ను ప్రశ్నిస్తుంటారు అయితే నా పరిధిలో లేని వాటి గురించి నన్ను ప్రశ్నిస్తే నేనేం సమాధానం చెప్పగలను అంటూ ఈమె బదులిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -