Revanth: తెలంగాణ రాజకీయాలను రేవంత్ మార్చడం సాధ్యమేనా?

Revanth: సాధారణంగా రాజకీయాల్లో రాజకీయ నేతల కంటతడి కొన్ని ఎన్నిసార్లు వర్క్ ఔట్ మరికొన్ని సార్లు ఫెయిల్ అవుతూ ఉంటుంది. కానీ కంటతడి వల్ల ఎక్కువ శాతం మంది సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. సానుభూతి కోసం సింపతీ కోసం కొంతమంది కంటతడి పెట్టినట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు. ఓటర్లను వారి వైపు మలుచుకోవడం కోసం కంటతడి సింపతిని ట్రై చేస్తూ ఉంటారు. గతంలో చాలా ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు చూశాము. కాగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా ఇదే ఫార్ములాను అమలు చేస్తున్నారు.

కేసీఆర్ వద్ద తాను డబ్బులు తీసుకున్నానని ఈటల రాజేందర్ చేసిన ఆరోపణల్ని సీరియస్ గా తీసుకుని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పై తాను ఎంత తీవ్రంగా పోరాడుతున్నాననో చెప్పుకున్నారు. అలాగే తాను ఎన్ని ఇబ్బందులు పడ్డాను అన్నది మీడియా ముందు వివరించారు. కెసిఆర్ ని ఓడించడానికి జీవితాల్నే పణంగా పెట్టామని తెలిపారు రేవంత్. ఈ క్రమంలోనే ఆవేదనతో కంటతడి కూడా పెట్టారు. కేసీఆర్‌పై పోరాటంలో రేవంత్ రెడ్డిని ఎవరూ తక్కువగా అంచనా వేయలేరు.

 

రేవంత్ కు తెలంగాణలో ఎవరు ధీటైన నేత అంటే అత్యధిక మంది రేవంత్ రెడ్డి పేరే చెబుతారు. కానీ బీజేపీకి కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యత వల్ల ఆ పార్టీ కూడా పోటీకి వచ్చిందన్న అభిప్రాయం కూడా ఉంది. అయినప్పటికీ రేవంత్ రెడ్డి విస్తృతంగా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో తనను కించపరుస్తున్నా కూడా పార్టీ గెలుపు కోసం ఆయన శ్రమిస్తున్నట్లుగా ఎవరూ కష్టపడటం లేదు. ఇవన్నీ ప్రజల ముందు ఉంచి కంటతడి పెట్టారు రేవంత్ రెడ్డి. ఈటల రాజేందర్ కూడా రేవంత్ రెడ్డి విషయంలో తాను ఆధారాలు లేని ఆరోపణలు చేశానని ఒప్పుకున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి తన కంటతడితో తెలంగాణ రాజకీయాలు మార్చేలా కనిపిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -