Anupama: అనుపమ కోరుకున్నది జరగడం సాధ్యమేనా?

Anupama: టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ముందు మనందరికీ తెలిసిందే. మొదట అ ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకుంది. మొదటి సినిమాలో తన అందం అభినయంతో కట్టిపడేసిన ఈమె అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అనుపమ నటించిన ఈ తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

 

అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందం అభినయం అన్నీ ఉన్నా కూడా చాలామంది హీరోయిన్లకు అవకాశాలు మాత్రం రావడం లేదు. అటువంటి వారిలో అనుపమ కూడా ఒకరు. ఆవకాశాలు రాకపోవడంతో అనుపమ అడపాదడపా సినిమాలలో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఇటీవలె అనుపమ కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఇందులో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా దించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనుపమ సోలో హీరోయిన్ ఇమేజ్ కోసం బాగానే ప్రయత్నిస్తోంది. నయనతార, అనుష్క, సమంత స్థాయిలో కాకపోయినా ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలకు తను కూడా ఓ ఆప్షన్ గా నిలవాలి అనుకుంటోంది.

అయితే ఇప్పటికే ఈ దిశగ బట్టర్ ఫ్లై అనే సినిమా చేసింది అనుపమ. ఈ సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. కానీ ఆ సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వకపోవడం అనుపమకు పెద్ద మైనస్ గా మారింది. ఓటీటీలో విడుదల అయినప్పటికీ అందులో కూడా దీనికి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అయినప్పటికీ అనుపమ పరమేశ్వరన్ తన ప్రయత్నాలు ఆపలేదు. ఇప్పుడు అదే కోవలో మరో కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈసారి లైకా ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బ్యానర్ సపోర్ట్ ఈమెకు దక్కింది. మరో 2 రోజుల్లో సినిమా లాంఛ్ కానుంది. లైకా బ్యానర్ కాబట్టి ఈసారి థియేట్రికల్ రిలీజ్ కు ఢోకా లేదు. కాబట్టి ఈ సినిమా క్లిక్ అయితే కెరీర్ లో మరిన్ని ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ చేయాలనుకుంటోంది అనుపమ. మరి ఈ విషయంలో అనుపమ ఫలితాలు ఫలిస్తాయో లేదో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -