Pawan Kalyan: ఆ విధంగా పవన్ కళ్యాణ్ చేయడం కరెక్టేనా?

Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పేరు సంపాదించుకొని ఒక రేంజ్ లో అభిమానాన్ని సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. మరోవైపు రాజకీయ నాయకుడిగా కూడా బాధ్యతలు చేపట్టి ఎలాగైనా రానున్న ఎన్నికల్లో సీఎం కావాలన్నా తపనల్లో కనిపిస్తున్నాడు. ఒక వైపు సినిమాలు చేస్తూ, మరో వైపు రాజకీయపరంగా ప్రచారాలు చేస్తున్నాడు.

ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తన ట్వీట్ లతో విమర్శలు ఎదుర్కొంటూ ఉంటాడు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ద్వారా మరోసారి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈసారి ఏకంగా తారక్ ఫ్యాన్స్ అతనిపై తిరగబడ్డారు. ఇంతకు అసలు విషయం ఏంటంటే.. తన అన్న కొడుకు అయిన రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తరపున హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులో బెస్ట్ వాయిస్/ మోషన్ కాప్చర్ పెర్ఫార్మెన్స్ అందుకున్న సంగతి తెలిసిందే.

 

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ వేదికగా ఒక విషయాన్ని పంచుకున్నాడు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులో ఆర్ఆర్ఆర్ పలు పురస్కారాలు దక్కించుకోవడం ఆనందకరంగా ఉంది అని.. ఇక అదే వేదికపై బెస్ట్ వాయిస్/ మోషన్ క్యాప్చర్ పెర్ఫార్మెన్స్ ను రామ్ చరణ్ ద్వారా ప్రకటింప చేయటం, స్పాట్ లైట్ అవార్డు స్వీకరించడం మరింత సంతోషాన్ని కలిగించింది అని.. రామ్ చరణ్ కు, దర్శకుడు రాజమౌళికి, చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపాడు పవన్.

 

అంతేకాకుండా చరణ్ మరిన్ని మంచి చిత్రాలు చేసి అందరి మన్ననలు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ట్విట్ చేశాడు. దీంతో వెంటనే తారక్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఎక్కడ కూడా ఎన్టీఆర్ పేరును చెప్పకపోవడంతో.. పవన్ ను బాగా విమర్శిస్తున్నారు. అంతేకాకుండా ఆయనను సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇక తారక్ వీరాభిమాని.. ఒకే సినిమాలో పని చేసిన ఇద్దరు నటులను మీరు అభినందనలు చెప్పలేకపోయారు.. మీ అన్న కొడుకు అని మాత్రమే చెప్పుకున్నారు.. అలాంటిది మీరు రేపు పొరపాటున ముఖ్యమంత్రి అయితే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయగలుగుతారా అని గట్టిగా ప్రశ్నించారు. నిజానికి పవన్ ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. మరి ఈ విషయం గురించి పవన్ ఏమని స్పందిస్తాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -