Alekhya Reddy: అలేఖ్యారెడ్డికి ఇంత కష్టమా.. ఇన్ని ఇబ్బందులు పడుతున్నారా?

Alekhya Reddy: నందమూరి తారకరత్న మరణించడంతో అలేఖ్య రెడ్డి ఒంటరి అయ్యారు.తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీ గుండెపోటుకి గురై మరణించిన విషయం మనకు తెలిసిందే. అయితే తన భర్త మరణించిన విషయాన్ని అలేఖ్య రెడ్డి ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు ఈ క్రమంలోని సోషల్ మీడియా వేదికగా ఈమె తన భర్తకు సంబంధించిన విశేషాలను జ్ఞాపకాలను షేర్ చేయడంతో ఎంతోమంది ఈమె ఇంకా ఆ బాధ నుంచి బయటపడలేదని భావిస్తున్నారు.

తారకరత్న మరణంతో అలేఖ్య రెడ్డి ఒంటరి అయ్యారు. తారకరత్న అలేఖ్య రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో అది ఇష్టం లేనటువంటి ఆయన కుటుంబ సభ్యులు తనని ఇంటికి దూరం చేశారు.ఇలా అలేఖ్య రెడ్డి తన పిల్లలతో ఎంత సంతోషంగా ఉన్నటువంటి తారకరత్న ఉన్నఫలంగా గుండెపోటుకు గురై మరణించడంతో అలేఖ్య రెడ్డిని ఆదరించేవారు లేరని తన కన్నీటిని తుడిచేవారు లేరని తెలుస్తుంది.

 

మొదటినుంచి తారకరత్నకు బాలకృష్ణ ఎంతో అండగా నిలబడ్డారు. అయితే ఆయన మరణించిన తర్వాత కూడా అలేఖ్య రెడ్డి అలాగే పిల్లల బాధ్యతలను తాను తీసుకుంటానని బాలకృష్ణ భరోసా ఇచ్చారు. ఆయన చెప్పిన విధంగానే అలేఖ్య రెడ్డి కుటుంబాన్ని ఆర్థికంగా కూడా బాలకృష్ణ ఆదుకుంటున్నారు.కేవలం బాలకృష్ణ మాత్రమే కాకుండా తారకరత్న కుటుంబ సభ్యులు కూడా అలేఖ్య రెడ్డిని ఆదరిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

తారకరత్న మరణించి దాదాపు మూడు నెలలు అవుతున్నా అలేఖ్య రెడ్డి మాత్రం తన జ్ఞాపకాల నుంచి బయటపడలేకపోతున్నారు. అయితే ఈమె తిరిగి సాధారణ స్థితికి రావాలి అంటే తాను ఏదో ఒక పనిలో బిజీ కావాలని అప్పుడే మెల్లిగా తన పనులలో బిజీ అవుతూ తారకరత్న మరణ వార్త నుంచి బయటపడుతుందని పలువురు భావిస్తున్నారు. తన శ్వాస ఉన్నంతవరకు తనని ప్రేమిస్తూనే ఉంటాను అంటూ మరోసారి తన భర్త పై ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.

 

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -