AP: ఏపీని కాపాడాల్సిన బాధ్యత ప్రజలదేనా.. వాళ్లను నమ్మితే కష్టమేనా?

AP: ఏపీకి ప్రత్యేకహోదా వస్తే అందరికీ కావాలి.. కానీ రాదు.. అందుకే అందరూ మౌనంగా ఉన్నారు. ఇప్పటికే ప్రత్యేకహోదా పేరుతో 2 ఎన్నికల్లో మోసపోయిన ఏపీ ప్రజలను మరోసారి మభ్యపెట్టడానికి వైఎస్ షర్మిల రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రత్యేకహోదాయే ప్రధాన అస్త్రంగా ఏపీ కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెట్టింది. ఆ వ్యూహాలను షర్మిల అమలు చేస్తోంది. అయితే, 2014, 2019 ఎన్నికలు కూడా ప్రత్యేకహోదా చుట్టూ తిరిగాయి. ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని 2014 ఎన్నికల్లో బీజేపీ చెప్పింది.

 

ఎన్నికలు తర్వాత పలు కారణాలు చెప్పి.. మాట మార్చింది. దీంతో, ఈ ప్రత్యేకహోద అంశం వైసీపీకి అస్త్రంగా మారింది. బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ ప్రత్యేకహోదా తీసుకొని రాలేదని జగన్న ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. ఆ ప్రచారం ఫలితంగా 2019 ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీతో గెలిచింది. కానీ, ఎన్నికల తర్వాత వైసీపీ ప్రత్యేకహోదా మాటే ఎత్తలేదు.

రెండు సార్లు మోసం పోయిన ప్రజలు నెమ్మదిగా ప్రత్యేకహోదా అంశాన్ని మళ్లీ కాంగ్రెస్ గుర్తు చేస్తుంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదా ఇస్తామని షర్మిల ఎక్కడిక్కడ ప్రకటిస్తున్నారు. నిజానికి ప్రత్యేకహోదా సాధ్యమా అంటే.. అవకాశాలు చాలా తక్కవని చెప్పాలి. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ తో అసలు సాధ్యం కాదు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే.. ప్రత్యేకహోదా ఇస్తారంటున్న షర్మిల.. అసలు రాహుల్ ప్రధాని అవుతారా? అని ఆలోచించాలి. కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అందుకే.. మిత్రపక్షాలతో కలిసి ఇండియా కూటమిని కట్టారు. కానీ..ఈ కూటమి పార్టీలు తలో దారిలో ఉన్నాయి. సీట్ల పంచాయితీ ఇంకా కొలిక్కిరాలేదు. సింగిల్ గా పోటీ చేస్తామని కూటమిలో కీలక నేత మమత బెనర్జీ చెప్పారు.

 

మరో అత్యంత కీలకమైన రాష్ట్రం యూపీలో కూడా అఖిలేష్ తో కాంగ్రెస్ చర్చలు జరుపుతుంది. కానీ, ఈ చర్చలు కూడా ఎంతవరకు సఫలీకృతం అవుతాయో చెప్పలేం. కాంగ్రెస్ అడుగుతున్న స్థానాలకు, అఖిలేష్ ఇస్తానంటున్న స్థానాలకు అసలు పొంతనే లేదు. కాంగ్రెస్ 16 స్థానాలు అడిగితే, ఎస్పీ 4 స్థానాలు ఇస్తానంటుంది. కాబట్టి యూపీలో పొత్తు పొడిచేవరకూ చెప్పలేం. ఒకవేళ అన్ని కుదిరి ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినా.. ఏపీకి ప్రత్యేక హోదాను చాలా మంది అడ్డకుంటారు.

 

ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే.. బీహార్ సీఎం నితీష్ కుమార్ అడుగుతారు. దీంతో పాటు.. ఏపీకి పక్కనే ఉన్న కర్నాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీకి సహకరిస్తాయో లేదో చెప్పలేం. మరీ ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వం ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని అడ్డుకోవచ్చు. ఎందుకంటే ఏపీకి హోద వస్తే.. చెన్నై నుంచి కంపెనీలు తరలిపోతాయని భయం. ఇన్ని సమస్యలు ఉండగా.. వైఎస్ షర్మిల.. చాలా ఈజీగా ఏపీకి ప్రత్యేకహోదా తీసుకొని వస్తామని ప్రకటిస్తున్నారు. ఇది ప్రజలను మరోసారి మోసం చేయడమే అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -