Jagan-Pawan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్లే జగన్ కు మేలు జరుగుతోందా?

Jagan-Pawan: ఉభయ గోదావరి జిల్లాల్లో వారాహి వాహనంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్ర చేపట్టారు. ఇప్పటికే తూర్పు గోదావరిలో యాత్రని ముగించారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో యాత్ర నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వమే దించటమే లక్ష్యంగా పవన్ విమర్శలు ఉంటున్నారు. కూలాల వారిగా మాట్లాడుతూనే, అభివృద్ధి ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు. దీంతో సీఎం జగన్ అలర్ట్ అయ్యారు. కాపులను బిగ్ గిప్ట్ ఇచ్చారు.

 

ఆంధ్రప్రదేశ్ లో పవన్ వారాహి విజయయాత్ర సీఎం జగన్ కు నిద్ర పట్టనివ్వటం లేదని తెలుస్తోంది. ఎక్కడ మీటింగ్ పెట్టినా, సీఎం జగన్ అండ్ కోటరీని అడ్డాగా చేసుకొని ఆరోపణలు చేస్తున్నారు. మాఫియా ప్రభుత్వం అంటూ ఆవేశంతో మాట్లాడుతున్నారు. రెండు జిల్లాల్లో ఒక్క సీటు కూడా రానివ్వని శబదం చేస్తున్నారు. పక్కగా జనసేన సర్కారు ఏర్పాటుతో ప్రతి కులానికి న్యాయం చేస్తామని భరోసా కల్పిస్తున్నారు.

విజయవాడ కాపు భవన్ కు కోటిరూపాయలు, విశాఖ, కర్నూలు జిల్లాల కేంద్రాల్లో భవనాల ఏర్పాటుకు చెరో రు. 50 లక్షలు విడుదలైనట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపుల సంక్షేమానికి జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల కేంద్రాలవారీగా కమిటీల ఏర్పాటుకు కాపు కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కాపు నేస్తం పథకంలో భాగంగా ఇప్పటివరకు ప్రభుత్వం రు. 1500 కోట్ల విడుదలచేసినట్లు చెప్పారు. జగనన్న విద్యాపథకంలో భాగంగా 42 మంది కాపు విద్యార్ధులు విదేశాలకు వెళ్ళి చదువుకునేందుకు సాయం అందిందన్నారు.

 

ఇక తునిలో జరిగిన రైలు దహనం కేసులో కాపులపై నమోదైన 42 కేసులను తమ ప్రభుత్వం ఎత్తేసిన విషయాన్ని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో కాపు కార్పొరేషన్ నిధుల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరుపుతున్న కమిటి నివేదికను మరో 15 రోజుల్లో ఇస్తుందన్నారు. నవరత్నాలతో సంబంధంలేకుండానే కాపునేస్తం ద్వారా మూడేళ్ళలో తమ ప్రభుత్వం రు. 1500 కోట్లు విడుదలచేసిందన్నారు.

 

కాపు ఓట్లనే ప్రధాన లక్ష్యంగా చేసుకొని పవన్ ప్రచారం చేస్తున్నారు. జనసేన వైపు వారిని తిప్పుకునేందుకు కాపులే లక్ష్యంగా స్పీచ్ ఇస్తున్నారు. అందుకే ఏమో జగన్ భయపడ్డారో ఈ నిధులు విడుదల చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా పవన్ వల్ల తమకి న్యాయం జరుగుతోందని కాపుల్లో ఓ అభిప్రాయమతే ఏర్పడినట్లు కనిపిస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -