Rajamouli: ఆ ఎన్నికల్లో జక్కన్న ప్రచారం చేయనున్నారా.. ఏమైందంటే?

Rajamouli: ఈ మధ్య రాజకీయ నాయకులు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులను బాగా దగ్గర చేసుకుంటున్నారు. ముఖ్యంగా తమ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు సినీ ప్రముఖులను లాగుతున్నారు. ఇప్పటికే రానున్న ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో పలువురు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులను రంగంలోకి దింపుతున్నట్లు తెలిసింది.

 

అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి కూడా రాజకీయపరంగా ప్రచారం చేయనున్నట్లు తెలుస్తుంది. అంటే ఇది పార్టీ తరపున కాకుండా.. ప్రజలలో ఓటింగ్ అవగాహన తెలియచేయటం. రాబోయే ఎన్నికల కోసం రాయచూర్ జిల్లా కి రాజమౌళిని ప్రచారకర్తగా నియమించినట్లు తెలుస్తుంది. ఇక రాజమౌళి జన్మించిన స్థలం రాయచూరు లోని మానవి తాలూకా అమరేశ్వర క్యాంప్. అయితే అందులో భాగంగా ఆయన అక్కడే ప్రచారం చేస్తే ప్రజలలో మరింత అవగాహన పెరుగుతుంది అని తెలిసింది.

ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ కు రాజమౌళి పేరు చేర్చినట్లు రాయచూరు కలెక్టర్ చంద్రశేఖర్ నాయక్ తెలిపారు. ఆ ప్రతిపాదనను కర్ణాటక ఎలక్షన్ కమిషన్ ఆమోదించింది అని ఆయన తెలిపాడు. ఇక రాజమౌళి కూడా దీనికి ఆమోదం తెలిపినట్లు తెలిసింది. ఇక ప్రత్యక్ష ప్రచారంతో పాటు వీడియోస్ సందేశాల ద్వారా కూడా ప్రజలలో ఓటింగ్ పట్ల అవగాహన పెంచడం ఎలక్షన్ ఐకాన్ ప్రధాన కర్తవ్యం.

 

ఇక అలా ఎలక్షన్ ఐకాన్ గా రాజమౌళిని తీసుకున్నట్లు తెలిసింది. ఇక ఎన్నికల సంఘం సూచనల మేరకు ప్రజలలో అవగాహన కల్పించేలా చేస్తారు. ఇక ఆ వీడియోలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలన్న విషయాలు తెలుపరని కేవలం ఓటర్లు పాల్గొనేలా అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆ సినిమాలో నటించిన నటీనటులకే కాకుండా రాజమౌళికి కూడా ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -