Jakkanna: టాలీవుడ్ హీరోల మల్టీస్టారర్‌ను జక్కన్న ప్లాన్ చేస్తున్నారా?

Jakkanna: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండరు. టాలీవుడ్ గతిని.. ఆ మాటకొస్తే భారతీయ సినిమా దశ, దిశను మార్చిన వ్యక్తిగా రాజమౌళిని చెప్పొచ్చు. ఒక సినిమా ఫలానా ఇండస్ట్రీకే పరిమితమవుతున్న కాలంలో పాన్ ఇండియా చిత్రాలను అందరికీ ఆయనే పరిచయం చేశారు. ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ వరల్డ్ ట్రెండ్ ను కూడా ఆయనే క్రియేట్ చేశారు.

దర్శక నిర్మాతలు ఏ ఒక్క ప్రాంతానికో, భాషకో తమ ప్రతిభను పరిమితం చేసుకోవద్దని రాజమౌళి తన సక్సెస్ ద్వారా నిరూపించారు. ప్రతిభకు హద్దుల్లేవని ఆయన ప్రూవ్ చేశారు. ‘బాహుబలి’ సిరీస్ తోపాటు ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు చిత్రసీమ ఖ్యాతిని జక్కన్న విశ్వవ్యాప్తం చేశారు. ఈ ఏడాది ఆయన నుంచి వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్ సినిమాల్లో ఆల్ టైమ్ టాప్–3 గ్రాసర్స్ లో ‘ఆర్ఆర్ఆర్’ ఒకటిగా నిలిచింది. విదేశాల్లోనూ ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. జపాన్ లోనైతే ఏకంగా రూ.20 కోట్లు వసూలు చేసి వహ్వా అనిపించింది.

‘ఆర్ఆర్ఆర్’ నెట్ ఫ్లిక్స్ లోనూ హవా చూపించింది. వరుసగా పలు నెలలపాటు నెట్ ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్స్ లో నిలిచి.. టాలీవుడ్ సత్తా చాటింది. తారక్ ఫైట్స్, డ్యాన్సులు, నటనకు ఇండియన్ ఆడియెన్స్ తోపాటు ఫారిన్ ఆడియెన్స్ కూడా ఫిదా అవుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేసేందుకు జక్కన్న సమాయత్తమవుతున్నారు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. వచ్చే జూన్ లో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.

అంతమంది హీరోలు ఒకే సినిమాలోనా..?
మహేష్ మూవీ తర్వాత ఓ భారీ మల్టీస్టారర్ సినిమాను రూపొందించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. ఒకే సినిమాలో పవన్ కల్యాన్​, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్​ తోపాటు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఉండేలా జక్కన్న భావిస్తున్నారట. ఈ మూవీకి ఏకంగా రూ.1,000 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ఆయన రూపొందించనున్నారని సమాచారం. ఇందులో ఎంత నిజముందనేది ఆయనకే తెలియాలి. ఒకవేళ ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే మాత్రం భారతీయ సినిమా చరిత్రలో ఓ అపురూమైన దృశ్యకావ్యం రెడీ అవుతున్నట్లేనని చెప్పాలి. దీనిపై రాజమౌళే క్లారిటీ ఇవ్వాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -