Tarak: తారక్ తలపై రూ.5000 కోట్ల బడ్జెట్.. వర్కౌట్ అవుతుందా?

Tarak: టాలీవుడ్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నారు రాజమౌళి. ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకోవడంతో పాటు సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఇది ఇలా ఉంటే గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రాజమౌళి ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారీగా గుర్తింపును తెచ్చుకోవడం తో పాటు తెలుగు సినిమా ఖ్యాతిని మరింత విస్తరించేలా తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వించదగ్గ స్థాయికి ఎదిగారు రాజమౌళి.

కాగా గత ఏడాది విడుదలైన ఆర్ఆర్ఆర్ నాకు రాజమౌళి దర్శకత్వం వహించగా అందులో ఇద్దరు స్టార్ హీరోలు నటించిన విషయం తెలిసిందే. ఒకరు రాంచరణ్ కాగా మరొకరు జూనియర్ ఎన్టీఆర్. ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ జక్కన్న కాంబినేషన్ లో 5000 కోట్ల రూపాయల బడ్జెట్ తో భారీ సినిమా దిశగా అడుగులుపడుతున్నాయని తెలుస్తోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో తెరకెక్కించబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు చూసుకోవడంతో పాటు ఎన్టీఆర్ తో మరో సినిమాలు చేయాలని ఎందుకు అనుగుణంగా స్క్రిప్ట్ పనులు చూస్తున్నట్టు కూడా తెలుస్తోంది.

 

ఒకవేళ ఇదే గనుక నిజమైతే ఎన్టీఆర్ అభిమానులకు ఇక పండగే పండగ అని చెప్పవచ్చు. మరి ఎన్టీఆర్ పై ఈ స్థాయి బడ్జెట్ అంటే వర్కౌట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. మరి 5000 కోట్ల రూపాయల బడ్జెట్ ను పెట్టి సినిమా తీస్తే తారక్ ఆ టార్గెట్ ని రీచ్ అవుతారా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -